Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: క్యారెట్ ఆరోగ్యకరం అని రోజూ తింటున్నారా? అయితే నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తెలుసుకోండి..

Health Tips: క్యారెట్ రోజూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతుంటారు. క్యారెట్‌లో ఉండే పోషకాలు వ్యక్తి ఆరోగ్యాన్ని మరింత పెంచుతాని వైద్యులు

Health Tips: క్యారెట్ ఆరోగ్యకరం అని రోజూ తింటున్నారా? అయితే నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తెలుసుకోండి..
Carrot
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 01, 2022 | 6:48 AM

Health Tips: క్యారెట్ రోజూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతుంటారు. క్యారెట్‌లో ఉండే పోషకాలు వ్యక్తి ఆరోగ్యాన్ని మరింత పెంచుతాని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంతేకాదు.. అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంటారు. రొమ్ము క్యాన్సర్, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడం మొదలు అనేక ఉపయోగాలు క్యారెట్ తినడం ద్వారా కలుగుతాయని ప్రచారం. ఇదంతా వాస్తవమే. క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ రోజులో కనీసం మొత్తంలో క్యారెట్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. మరి క్యారెట్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాల గని.. క్యారెట్ పోషకాల గని. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. సమతుల ఆహారమైన క్యారెట్‌ను తినడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాలానుగుణంగా వీటిని తినడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

కాలేయ ఆరోగ్యంగా ఉండేందుకు.. క్యారెట్‌లలో ఉండే బీటా కెరోటిన్, ప్లాంట్ ఫ్లేవనాయిడ్స్ కాలేయానికి మేలు చేస్తుంది. ఈ రెండు మూలకాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయ సమస్యల నివారణలో సహకరిస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాన్సర్ నివారణిగా.. క్యారెట్‌లో ఫల్కారినోల్ అనే రసాయన సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రాణాంతకత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ దుష్ప్రభావాలను నివారిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులో, ముఖ్యంగా చర్మం, జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. అనే అధ్యయనాల్లో ఈ విషయం నిరూపితమైంది.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. క్యారెట్‌లో పిండిపదార్థాలు చాలా తక్కువ. అందుకే మధుమేహంతో బాధపడేవారికి క్యారెట్ శ్రీరామ రక్ష వంటిదని చెబుతారు ఆరోగ్య నిపుణులు. క్యారెట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు క్యారెట్ జ్యూస్‌కు బదులుగా క్యారెట్‌లను తింటే మరింత ప్రయోజనం కలుగుతుంది.

ఇతర ప్రయోజనాలు.. క్యారెట్ తినడం వల్లే మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందమైన చర్మం, జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు ఉంటుంది.

క్యారెట్‌ను అతిగా తింటే కలిగే నష్టాలు.. అతి ప్రమాదకరం అని చెబుతుంటారు. ఇది క్యారెట్ విషయంలోనూ వర్తిస్తుంది. క్యారెట్‌ను ఎక్కువగా తింటే దుష్ప్రభావాలు కూడా కలుగుతాయట. రక్తంలో ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందట. బీటా-కెరోటీన్ అధికమై.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also read:

Big News Big Debate: అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా? పుతిన్‌ ప్రకటనలు కీడు శంకిస్తున్నాయా?

Mother Love: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. ఉద్వేగానికి గురి చేస్తున్న సింహం వీడియో.. మీరూ ఓ లుక్కేయండి..!

Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!