Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..

Shocking: భార్యభర్తలన్నాక చాలా సమస్యలుంటాయి. ఆ క్షణంలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. మరుక్షణంలో కలిసిపోతారు. అదే భార్యభర్తల అనుబంధం అంటే.

Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..
Red Mirchi
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 28, 2022 | 8:37 PM

Shocking: భార్యభర్తలన్నాక చాలా సమస్యలుంటాయి. ఆ క్షణంలో కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. మరుక్షణంలో కలిసిపోతారు. అదే భార్యభర్తల అనుబంధం అంటే. సనాతన భారతీయ సంప్రదాయం భార్య భర్తల బంధాన్ని ఆ విధంగా ప్రేరేపించిందనే చెప్పాలి. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. వారిలో వారే సర్దుకుపోతారు. మూడో వ్యక్తి కలుగజేసుకుంటే మాత్రం కథ వేరే ఉంటుందనే చెప్పాలి. అయితే, ప్రస్తుల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ బంధాలు.. పెళ్లి బంధాలను నిలువునా తుంచేస్తున్నాయి. అయితే, కొందరు స్త్రీలు మాత్రం విభిన్నమే చెప్పాలి. తమ భర్తలతో సంబంధాలు నెరిపే వారిని గుర్తించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దుమ్ము దులుపుతున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడాలంటేనే హడలిపోయేలా షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన.. గుజరాత్‌లో వెలుగు చూసింది. అయితే, ఈ ఘటనలో అత్యంత జుగుస్సాకరంగా ఉంది. భయానికే భయం పుట్టించేలా ఉన్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం రాజ్‌కోట్‌లోని అవధ్ రోడ్డులో ఓ యువతి తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉంది. యువతిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. యువతి ప్రైవేట్ పార్ట్స్ సహా శరీరం అంతా తీవ్రగాయాలతో ఉండటంతో అత్యాచారం జరిగిందేమో అని అనుమానించారు పోలీసులు. యువతి కోలుకున్న తరువాత ఏం జరిగిందని పోలీసులు ఆరాతీయగా.. షాకింగ్ విషయాలు వెల్లడించింది. వివాహేతర సంబంధమే యువతి దుస్థితికి కారణమని పోలీసులు తేల్చారు. యువతి.. పెళ్లైన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ విషయం చివరకు సదరు వ్యక్తి భార్యకు తెలిసిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిందాభార్య. సరైన సమయం కోసం ఎదురు చూసి ఆమె.. యువతిని ఓ రోజు పట్టుకుంది. మరో ఇద్దరు యువకుల సాయంతో కిడ్నాప్ చేసింది. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదింది. అంతటితో శాంతించని సదరు మహిళ.. ఆ యువతి ప్రైవేటు పార్ట్‌లో మిర్చి పొడిని వేసి చావబాదింది. అనంతరం చేతులు, కాళ్లను చేతులతో కట్టేసి రోడ్డుపై పడేసింది.

బాధిత యువతి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను, మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తన భర్తను వలలో వేసుకుందని, తన కాపురాన్ని నాశనం చేసిందని యువతిపై ఆరోపించింది మహిళ. ఆ కారణంగానే కొట్టినట్లు చెప్పింది.

Also read:

Russia, Ukraine War: ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత సభ్యత్వాన్ని ఉక్రెయిన్ ఎందుకు వ్యతిరేకిస్తుంది..

India and Russia: పశ్చిమ దేశాలు భారత్‌ను ఇరుకున పెట్టిన ప్రతిసారీ అండగా నిలిచిన రష్యా..వివరాలివిగో..

CM KCR Delhi Tour : ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 3రోజుల పాటు అక్కడే.. ఎవరెవర్ని కలవనున్నారంటే?