AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ లివర్‌ డేంజర్‌లో ఉన్నట్లే..

Health: మనిషి శరీరంలో కీలక అవయవాల్లో లివర్‌ (Liver) ఒకటి. శరీరంలో ఉండే అతి పెద్ద అవయవమైన లివర్‌ ఎన్నో పనులను నిర్వర్తిస్తుంది. లివర్‌ పనితీరు మెరుగ్గా ఉంటే ఆరోగ్యం (Health) బాగా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే..

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ లివర్‌ డేంజర్‌లో ఉన్నట్లే..
Health
Narender Vaitla
|

Updated on: Mar 01, 2022 | 6:55 AM

Share

Health: మనిషి శరీరంలో కీలక అవయవాల్లో లివర్‌ (Liver) ఒకటి. శరీరంలో ఉండే అతి పెద్ద అవయవమైన లివర్‌ ఎన్నో పనులను నిర్వర్తిస్తుంది. లివర్‌ పనితీరు మెరుగ్గా ఉంటే ఆరోగ్యం (Health) బాగా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందించే బాధ్యత లివర్‌దే. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే లివర్‌కు ఏమైన సమస్య వస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే లివర్‌ ఆరోగ్యం ప్రమాదంతో పడుతుందన్న విషయాన్ని కొన్ని ముందుస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అవేంటంటే..

  1.  లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే ముందుగా కనిపించే లక్షణం పొట్ట ఉబ్బడం. లివర్‌ పనితీరు మెరుగ్గా లేకుంటే ఎప్పుడూ కడుపు ఉబ్బరం ఉన్నట్లు అనిపిస్తుంది. గ్యాస్‌ సమస్య వేధిస్తుంటుంది.
  2.  లివర్‌ చెడిపోతే కొందరిలో కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కుడివైపు ఊపిరితిత్తుల కింది భాగంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువకాలంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
  3.  కొందరిలో లివర్‌ పాడైతే చర్మంపై దురదలు, వాపులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినా లివర్‌ పనితీరు పాడవడం ద్వారా కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
  4.  దీర్ఘకాలంగా అజీర్ణ సమస్యతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడంలో లివర్‌ పాత్ర కీలకం. లివర్‌ పనితీరు దెబ్బతింటే ముందుగా ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థపైనే అని గుర్తించాలి.
  5.  లివర్ దెబ్బతిన్న వారిలో ముందుగా కనిపించే లక్షణాల్లో శరీరం పసుపు రంగులోకి మారడం మరొకటి. చర్మంతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.
  6.  లివర్‌ సమస్యతో బాధపడేవారిలో కాళ్ల వాపు సమస్య కూడా ఉంటుంది. వాపు ఉన్న చోట నొక్కితే గుంటలా ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నోట్‌: పైన తెలిపిన అంశాలు లివర్‌ పాడైందని చెప్పడానికి ముందస్తు లక్షణాలే అయినప్పటికీ.. ఇవి కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించినవే అని గుర్తించాలి. ఈ లక్షణాలు ఉన్న వారందరికీ లివర్ పాడైందని అర్థం కాదు. అయితే శరీరంలో ఎంతో కీలకమైన లివర్‌ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త తీసుకోకూడదు కాబట్టి. పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం..

Also Read: Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..

Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..