AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother Love: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. ఉద్వేగానికి గురి చేస్తున్న సింహం వీడియో.. మీరూ ఓ లుక్కేయండి..!

Viral Video: మనిషి అయినా.. జంతువు అయినా.. పక్షి అయినా, జలచరమైనా.. ఏ ప్రాణి అయినా మాతృత్వానికి అతీతమేమీ కాదు. ప్రతి ప్రాణిలోనూ మాతృత్వం మూర్తీభవిస్తుంది.

Mother Love: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. ఉద్వేగానికి గురి చేస్తున్న సింహం వీడియో.. మీరూ ఓ లుక్కేయండి..!
Lion
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 28, 2022 | 9:08 PM

Viral Video: మనిషి అయినా.. జంతువు అయినా.. పక్షి అయినా, జలచరమైనా.. ఏ ప్రాణి అయినా మాతృత్వానికి అతీతమేమీ కాదు. ప్రతి ప్రాణిలోనూ మాతృత్వం మూర్తీభవిస్తుంది. తన పిల్లలకు ఆపద వస్తే.. తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. తన పిల్లలకు కొంచెం కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది ఆ తల్లి హృదయం. ఈ ప్రేమ భూమిపై ఉన్న ప్రతీ జీవరాశిలోనూ కనిపిస్తుంది. తాజాగా తల్లి సింహానికి సంబంధించిన ఓ అద్భుతమై, అందమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మాతృ ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదని వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇబ్బందుల్లో ఉన్న తన పిల్లను చూసి తల్లడిల్లిపోయింది ఆ సింహం. వెంటనే వాటిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఫలవంతం అవడంతో హాయిగా తన పిల్లలతో కలిసి ఆడుకుంటూ వెళ్లిపోయింది. అడవి ప్రాంతంలో ఓ నీటి కుంట ఉంది. అయితే ఓ చోట గొయ్యి ఉండగా అందులో సింహం పిల్లలు పడిపోయాయి. గుట్టు షార్ప్‌గా ఉండటంతో పైకి ఎక్కలేక సింహం పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. పైకి ఎక్కేంతలోనే.. కిందకు జారిపడుతున్నాయి. అయితే గట్టుపైన ఉన్న తల్లి సింహం.. తన పిల్లల ఇబ్బందిని గమనించింది. వెంటనే కిందకు దిగింది. రెండు పిల్లలను నోట కరుచుకుని.. ఒక్క ఉదుటున పైకి దూకింది. తన పిల్లలను సేఫ్‌గా పైకి తీసుకువచ్చింది. పిల్లలు రెండూ పైకి రావడంతో ఆ తల్లి సింహం హాయిగా వాటితో ఆడుకుంటూ ముందుకు కదిలింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. భావోద్వేగాన్ని కలిగించే ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తల్లి ప్రేమ ముందు మరే ప్రేమైనా తక్కువే అని కామెంట్స్ పెడుతున్నారు యూజర్లు. మరెందుకు ఆలస్యం.. ఈ అందమైన వీడియోను మీరూ చేసేయండి.

Also read:

Russia Ukraine War: వ్యక్తిగత ఆశయాల కోసం హింసను ప్రేరేపించొద్దు: రష్యా టెన్నిస్ ప్లేయర్

వేములవాడలో శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు

Russia-Ukraine war: ముగిసిన రష్యా – ఉక్రెయిన్‌ శాంతి చర్చలు.. రష్యా ముందు పలు కీలక డిమాండ్స్