Health Tips: ఈ సమయంలో ఆహారం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసొంతం.. పూర్తి వివరాలు మీకోసం..!
Health Tips: మానవ రక్తంలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించిన విషయం తెలిసిందే. మనం తినే ఆహారమే ఈ పరిస్థితి దారి తీసినట్లు పరిశోధకులు తేల్చారు.
Health Tips: మానవ రక్తంలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించిన విషయం తెలిసిందే. మనం తినే ఆహారమే ఈ పరిస్థితి దారి తీసినట్లు పరిశోధకులు తేల్చారు. అలాగే, మనం తినే ఆహారానికి, వాతావరణ మార్పులకు మధ్య సంబంధం ఉందని కూడా తేల్చారు. అది మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. నిలకడలేని ఆహారపు అలవాట్లు, పారిశ్రామికీకరణతో కూడిన ఆహారం భూమికి విపరీతమైన నష్టాన్ని తలపెడుతుంది. అది చివరికి మనిషి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే మనం నివసించే భూమిని కాపాడుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పుల వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చన్నారు.
శాఖాహారం మంచిది: మొక్క-ఆధారిత ఉత్పత్తుల కంటే మాంసం ఆధారిత ఉత్పత్తులు గణనీయంగా ఎక్కువ కార్బన్ లక్షణాలను కలిగి ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది స్థిరమైన ఆహారం కాదని పేర్కొన్నారు. స్థిరమైన ఆహారం కోసం మొక్కల ఆధారిత ఫుడ్‌ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇది భూమిపై పడే పర్యావరణ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందట. మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
మధ్యాహ్న భోజన సమయాన్ని ఫిక్స్ చేయండి: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. మధ్యాహ్నం భోజన సమయాన్ని ఫిక్స్ చేసుకుని.. ఆ సమయంలో తగిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది.
డైరీ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి.. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆహారం తీసుకోవాలి. ప్రకృతితో పాటు మనం జీవించకపోవడం వల్ల వాతావరణం మన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అందుకే కాలానుగుణంగా ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం సంబంధం లేకుండా నిరంతరం డైరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి.. ప్రకృతితో జీవిస్తూ, స్వచ్ఛమైన ఆహారాన్ని తినాలి. వీలైతే రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయాలి. లేదా ఇంట్లో పండించిన ఆహారాన్ని తినాలి. అధ్యయనం ప్రకారం, మన శరీరంలో కంప్రెస్ చేయబడిన కణాలు ఉన్నందున శుభ్రమైన ఆహారాన్ని తినడం ఉత్తమం.
Also read:
Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..
Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!
Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!