Back Pain: మీ వెన్నెముక విపరీతంగా పెయిన్ వస్తుందా? చికిత్స లేకుండానే ఇలా తగ్గించుకోండి..

ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, తక్కువ బరువ , సరికాని ఆహారం వెన్నునొప్పి సమస్యకు దారితీయవచ్చు.

Back Pain: మీ వెన్నెముక విపరీతంగా పెయిన్ వస్తుందా? చికిత్స లేకుండానే ఇలా తగ్గించుకోండి..
Back Pain
Follow us

|

Updated on: Nov 04, 2022 | 7:25 AM

ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, తక్కువ బరువ , సరికాని ఆహారం వెన్నునొప్పి సమస్యకు దారితీయవచ్చు. ఇటీవలి కాలంలో నడుము నొప్పి అనేది మన దేశంలో ఒక సాధారణ సమస్యగా మారింది. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని పాటించడం ద్వారా చికత్స లేకుండానే వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. సరైన భంగిమ:

ల్యాప్‌టాప్‌లలో, కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి వెనుక కండరాలు, వెన్నెముక, మెడపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. రాత్రిపూట మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేసేవారు మెడపైకి ఎత్తైన దిండు పెట్టుకుని పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముక దెబ్బతింటుంది. అందువల్ల మంచి భంగిమలో కూర్చోవడం ఉత్తమం.

2. చిన్న విరామం తీసుకోవడం:

పని సంబంధిత మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిసారీ చిన్న విరామాలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ వెన్నునొప్పి తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

3. వ్యాయామం:

ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయాల్లో మెడ, వీపు, భుజాలకు వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.

4. మంచి ఆహారం:

అధిక కొవ్వు పదార్ధాలను నివారించడం, తగినంత నీరు త్రాగడం వెన్నెముక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ కొవ్వు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన ఖనిజాలు మీ బరువును అదుపులో ఉంచుతాయి. మీ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో