Diabetes Diet: డయాబెటిస్ బాధితులు ఈ పప్పులు ఓ వరం.. ఇవి ఏ స్థాయిలో తింటే మంచిదో తెలుసా..
డయాబెటిక్ పేషెంట్లు తమ డాక్టర్ సలహా మేరకు పప్పులను తీసుకోవచ్చు. ఇక్కడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్ ఏ పప్పు తినాలో తెలుసుకోండి.
పప్పులో అధిక పరిమాణంలో ప్రొటీన్ ఉంటుంది. ప్రోటీన్ కోసం పప్పులు తినమని వైద్యులు తరచుగా రోగులకు సలహా ఇస్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పప్పులు తినాలి కదా.. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు పప్పులు తినాలా వద్దా అనేది నిపుణుల ఏమంటున్నారు..? అవి తినాలంటే, ఏ పప్పు వారికి మేలు చేస్తుంది..? ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్నవారికి . కానీ అవి ఎలా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకునేందుకు వైద్యుల సలహా ఇచ్చే నిర్దిష్ట పప్పులు ఏమైనా ఉన్నాయా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొన్ని పప్పులు ఎలా మంచివి..? ఎందుకు అనే దాని గురించి మరింత అర్థం చేసుకోవడానికి మనం నిపుణులు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..
మధుమేహానికి కారణం ఏంటి?
2030 నాటికి మధుమేహంతో జీవిస్తున్న వారి సంఖ్య 643 మిలియన్లకు చేరుతుంది. 2045 నాటికి 783 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ యొక్క ఏడీఎఫ్ డయాబెటిస్ అట్లాస్ టెన్త్ ఎడిషన్ 2021లో ప్రకారం, ఈ పెరుగుదల వెనుక ఉన్న ముఖ్య అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. స్థూలకాయంతో పాటు సమతుల ఆహారం తీసుకోకపోవడం మధుమేహానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు అంటున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ధాన్యాలు ఉపయోగకరంగా ఉంటాయా?
జనాభాలో ఎక్కువ భాగం శాఖాహారం తినేవారని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ మారుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. డయాబెటిస్ డైట్ ప్లాన్‌లో పప్పు ధాన్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే వీటికి ప్రోటీన్ మూలంగా ఉండటమే ముఖ్య కారణం. అధిక ఫైబర్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా కాయధాన్యాలు నెమ్మదిగా జీర్ణమవుతాయని పరిశోధనలో తేలింది.
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్లస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. కాయధాన్యాలు ఫైటోకెమికల్స్ (సపోనిన్లు , టానిన్లు) కూడా కలిగి ఉంటాయి. పప్పు తినడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
డయాబెటిక్ రాగులు ఏ పప్పులు తినాలి?
మధుమేహం ఉన్నట్లయితే పప్పు దినుసులను తెలివిగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. నువ్వులు తినడం చాలా మంచిదని అంటారు. ఇది కొలెస్ట్రాల్ పెరగడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో, మీరు మినుములను కూడా తినవచ్చు. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఇది కాకుండా, మీరు పెసర పప్పు కూడా తినవచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.
అయితే ఈ విషయంలో మీరు మీ వైద్యుడని ఓసారి సంప్రదించడం కూడా అవసరం. ఎందుకంటే మీ రక్తంలో చెక్కర స్థాయి ఎలా ఉందో మీ వైద్యుడు మాత్రమే చెప్పగలరు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మీకు తగిన పప్పులను ఎంచుకోవడంలో మీ వైద్యుడు మాత్రమే సూచించగలడు. పప్పులు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు.. అయితే అలా అని మీరు పప్పులను ఎక్కువగా తినవచ్చని దీని అర్థం కాదు. పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయని మాత్రమే గుర్తుంచుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం