Health: వాడిన నూనెని మళ్లీ మళ్లీ వాడుతున్నారా.? భారీ మూల్యం చెల్లించక తప్పదు.. కానీ కొన్ని చిట్కాలతో..

Health: మంచి నూనె లేనిది అసలు ఏ వంట పూర్తికాదు. ఇక మిర్చీలు, బజ్జీలు వేగించే సమయంలో నూనె మిగలడం సర్వ సాధారణమైన విషయం తెలిసిందే. అయితే మిగిలిన ఈ నూనెను తిరిగి వాడడం..

Health: వాడిన నూనెని మళ్లీ మళ్లీ వాడుతున్నారా.? భారీ మూల్యం చెల్లించక తప్పదు.. కానీ కొన్ని చిట్కాలతో..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 28, 2022 | 12:04 PM

Health: మంచి నూనె లేనిది అసలు ఏ వంట పూర్తికాదు. ఇక మిర్చీలు, బజ్జీలు వేగించే సమయంలో నూనె మిగలడం సర్వ సాధారణమైన విషయం తెలిసిందే. అయితే మిగిలిన ఈ నూనెను తిరిగి వాడడం కూడా కామన్‌. అయితే ఒకసారి ఉపయోగించిన నూనెను ఇలా మళ్లీ మళ్లీ వాడితే ఏం కాదా.? దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా.? అంటే కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా స్ట్రీట్‌ ఫుడ్స్‌ నడిపించే వాళ్లు నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. కాగి చల్లారిన నూనెను మళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను వాడటం ద్వారా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మీకు తెలుసా.? వాడిన నూనెను మళ్లీ వాడితే కలిగే దుష్ప్రభావాలు ఇవే..

* ఇలాంటి నూనెతో వండిన వంటకాలను తింటే గుండెకు హాని కలిగించే ఆల్జీమర్స్, స్ట్రోక్, క్యాన్సర్, పార్కిన్సన్స్, కాలేయ సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఆల్డిహైడ్స్‌ అనే విషపదార్థం కారణంగా ఈ అనర్థాలు జరుగుతాయి.

* నూనెను తిరిగి వాడడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని కారణంగా బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది.

* సాధారణంగా స్ట్రీట్‌ ఫుడ్‌ తినే సమయంలో రుచిగా ఉన్నా తిన్న తర్వాత గ్యాస్‌ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా ఇలా వాడిన నూనెను వాడటమే కారణం.

* ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను వాడటం ద్వారా వచ్చే ఫ్రీరాడికల్స్‌ కారణంగా క్యాన్సర్,ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఈ చిట్కాలు పాటించండి..

ఒక్కసారి వాడి మిగిలిన నూనెను వృథా కూడా చేయలేం. మరి అలాంటప్పుడు ఆ నూనెను ఏం చేయాలి. సురక్షిత రీతిలో తిరిగి వాడుకునే వెసులుబాటు లేదా.? అంటే… కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చేయొచ్చు. అవేంటంటే..

* వీలైనంత వరకు సరిపడ నూనెతోనే వేయించాలి. కొంచెం మొత్తంలో మిగిలితే వంటకు ఉపయోగించడం కంటే ఇంట్లో తుప్పు పట్టిన సామాన్లకు లుబ్రికెంట్‌గా వాడుకోవాలి.

* వంట చేసిన తర్వాత మిగిలిన నూనెను చల్లార్చిన తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లోకి తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే కొంతలో కొంత ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు.

* వాడిన నూనెను మరోసారి వాడే ముందు ఒకసారి నూనె స్థితి ఎలా ఉందో చెక్‌ చేసుకోవాలి. నూనె రంగు ముదురు రంగులోకి మారినా జిడ్డుగా ఉన్నా ఉపయోగించకపోవడమే మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే