Peanuts: పిల్లలకి వేరుశెనగలు పెడుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Peanuts: వేరుశెనగలని చాలామంది ఎంతో ఇష్టపడి తింటారు. రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Peanuts: పిల్లలకి వేరుశెనగలు పెడుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
Peanuts
Follow us

|

Updated on: Feb 25, 2022 | 3:46 PM

Peanuts: వేరుశెనగలని చాలామంది ఎంతో ఇష్టపడి తింటారు. రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొంతమందికి మాత్రం వేరుశెనగ అంటే ఎలర్జీ. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు. అయితే తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకి వేరుశెనగ పెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులకి వారు ఎలర్జీ నుంచి బయటపడుతారని చెబుతున్నారు. వేరుశెనగ ప్రోటీన్‌తో కూడిన చౌకైన గొప్ప అల్పాహారం. కానీ కొంతమంది దీనిని తినడం వల్ల అలెర్జీ బారిన పడుతారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య వేధిస్తోంది.

ఒక ఆరోగ్య సంస్థ 3 సంవత్సరాల వయసు ఉన్న 146 మంది పిల్లలపై ఒక పరిశోధన నిర్వహించింది. ఇందులో చిన్నారులకు ప్రతిరోజూ వేరుశెనగ అందించారు. మొదటగా అందరు ఎలర్జీ బారినపడ్డారు. తర్వాత కొన్ని రోజులు వేరుశెనగ ఇవ్వడం ఆపేసారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. కానీ ఈ సారి కొంతమంది మాత్రమే ఎలర్జీ బారినపడ్డారు. దీంతో పరిశోధన నిర్వాహకులు చిన్నప్పటి నుంచి వేరుశెనగ గింజలని కొద్ది కొద్దిగా తింటూ ఉంటే ఎలర్జీ బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.

పాశ్చాత్య దేశాలలో వేరుశెనగ అలెర్జీలు రెండు శాతం మంది పిల్లలను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీరు వేరుశెనగ గింజలని తినకూడదు. ఒక పిల్లవాడు ఎలర్జీకి గురైనప్పుడు అతడి పక్కన ఉన్న పిల్లలకి కూడా ఎలర్జీ సోకే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ అలెర్జీకి ప్రస్తుతం చికిత్స లేదు. ఇది పిల్లలలో ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. కానీ చిన్నప్పటి నుంచి వేరుశెనగ గింజలని కొంచెం కొంచెం తింటుంటే దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Children: మీ పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారా.. వెంటనే ఆహారంలో వీటిని చేర్చండి..!

Vitamin D: శరీరంలో విటమిన్ డి ఎంత ఉండాలి.. ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది..!

Pregnancy Test With Sugar: చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవచ్చా.. ఇందులో నిజమెంత..?

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..