Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children: మీ పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారా.. వెంటనే ఆహారంలో వీటిని చేర్చండి..!

Children: పిల్లలు సరైన ఆహారం తిన్నప్పుడే వారికి కావలసిన పోషకాలు అందుతాయి. లేదంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

Children: మీ పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారా.. వెంటనే ఆహారంలో వీటిని చేర్చండి..!
Childrens Diet
Follow us
uppula Raju

|

Updated on: Feb 25, 2022 | 3:47 PM

Children: పిల్లలు సరైన ఆహారం తిన్నప్పుడే వారికి కావలసిన పోషకాలు అందుతాయి. లేదంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అయితే పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనేది ఒక సవాలుతో కూడుకున్న పనే. ఎందుకంటే కొన్నిటిని వారు తింటారు మరికొన్నిటిని అవైడ్‌ చేస్తారు. ముఖ్యంగా చలికాలంలో పిల్లలు చిరుతిళ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి. కొన్ని రకాల ఆహారాల గురించి తెలుసుకుందాం. చలికాలంలో చిలగడదుంప అంటే పిల్లలకు చాలా ఇష్టం. మీరు చిలగడదుంపను ఆలివ్ నూనెలో వేయించి వాటికి జున్ను లేదా పనీర్‌ కలిపి తినిపించవచ్చు. అలాగే కొంతమంది పిల్లలకు బీట్‌రూట్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితులలో పిల్లలకు బీట్‌రూట్ తినిపించడానికి బీట్‌రూట్ స్మూతీ లేదా బీట్‌రూట్ కేక్‌లు చేయాలి. దీంతో వీటిని వారు కూడా ఇష్టంగా తింటారు.

సాల్మన్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల పిల్లలకు కంటి చూపు మెరుగుపడుతుంది. బ్రెయిన్ షార్ప్‌ అవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే పిల్లలకు ఎప్పుడూ వేడి పాలు ఇవ్వాలి. వెచ్చని పాలు తాగడం ద్వారా వారు బాగా నిద్రపోతారు. మరుసటి రోజు పిల్లలు చురుకుగా ఉంటారు. పిల్లలు పాలు తాగకపోతే అందులో రెండు బాదంపప్పులు వేసి, లేదా చాక్లెట్ పౌడర్ వేసి తాగించాలి.

పిల్లలకి రాగి రొట్టెలు కూడా మంచివే. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని పెరుగు లేదా ఊరగాయతో తినిపించవచ్చు. రాగిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్‌ను సప్లిమెంట్ చేయడానికి ప్రతిరోజు పిల్లలకు తప్పనిసరిగా ఉడికించిన గుడ్లు పెట్టాలి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు గుడ్లు తినిపించండం చాలా మంచిది. దీనివల్ల వారి ఎదుగుదల బాగా ఉంటుంది. శీతాకాలంలో చలిని కూడా తట్టుకునే శక్తి వస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Vitamin D: శరీరంలో విటమిన్ డి ఎంత ఉండాలి.. ఏ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది..!

Pregnancy Test With Sugar: చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవచ్చా.. ఇందులో నిజమెంత..?

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ అప్‌డేట్‌.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..!