Health Tips: ఈ నియమాలు పాటిస్తే ఈ రెండు జబ్బుల నుంచి బయట పడొచ్చు..!
Health Care Tips: ఇప్పుడున్న జనరేషన్‌లో జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవన శైలిలో మార్పుల కారణంగా ఎన్నో రోగాలు..
Health Care Tips: ఇప్పుడున్న జనరేషన్‌లో జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవన శైలిలో మార్పుల కారణంగా ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. మన జీవినశైలిలో మార్పు చేసుకుంటే మంచి జీవితాన్ని అనుభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్‌తో బాధపడేవారు ఉంటున్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇక గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
- సరైన వ్యాయమం లేకనే జబ్బులు.. ఒత్తిడి కారణంగా ఈ అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతి రోజు వాకింగ్ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు. మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని, ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
- ఉప్పును తక్కువ తీసుకోండి: అనేక అధ్యయనాలలో అధిక అధిక రక్తపోటు సోడియంతో ముడిపడి ఉంది. రోజువారీ దినచర్యలో తక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను నివారించవచ్చు. సాధారణంగా ప్రజలు ఉప్పును ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది. సాధారణంగా ఒక మనిషి రోజు మొత్తంలో 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తేల్చిచెప్పారు. అంతేకాదు డయాబెటిస్ ద్వారా బీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
- హైబీపీతో బాధపడేవారికి పోటాషియం ముఖ్యమైన పోషకం..హైబీపీతో బాధపడుతున్నవారు పోటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఆహారంలో పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన ఆహారాలలో అత్యధికంగా సోడియం ఉంటుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి పోటాషియం ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. అవి ఆకు కూరలు, టమోటాలు, బంగాళ దుంపలు, చిలగడ పండ్లు, అరటి, అవకాడో, నారిజం, నట్స్, పాలు, పెరుగు వంటివి.
- రోజూ వ్యాయమం చేయండి: ప్రతి వ్యక్తికి వ్యాయమం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది ఎంతో ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి 40 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
- ధూమపానం మానేయండి: ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మద్యం తాగడం వల్ల 16 శాతం అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయని పరిశోధనలలో తేలింది. ధూమపానం, మద్యపానం వల్ల రక్తనాళాలు పూర్తిగా దెబ్బ తింటాయని, ఈ రెండు మీ ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదంటున్నారు. అలాగే పిండి పదార్థాలు షుగర్, రక్తపోటు సమస్యను పెంచుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ రెండు విషయాలను తగ్గించడం వల్ల రక్తపోటు నుంచి కాపాడుకోవచ్చు.
- ఒత్తిడిని తగ్గించుకోండి: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో, మానసిక ఆందోళన, వివిధ రకాల పనులలో ఒత్తిడిలను తగ్గించుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. బీపీ ఉన్నవారు ఒత్తిడి కారణంగా మరిన్ని వ్యాధులు తెచ్చుకునే అవకాశం ఉంది. అధిక బీపీ ఉన్న వారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
మరిన్ని హెల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి