జస్ట్ తలనొప్పేగా అనుకునేరు.. ఈ ప్రమాదకర వ్యాధుల లక్షణం కూడా కావొచ్చు.. బీకేర్‌ఫుల్..
ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో సమస్యలతో చాలా మంది సతమతమవుతూ.. తలనొప్పితో బాధపడుతుంటారు.. అయితే.. తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. అది ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో సమస్యలతో చాలా మంది సతమతమవుతూ.. తలనొప్పితో బాధపడుతుంటారు.. అయితే.. తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. అది ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది.. తీవ్రమైన పని ఒత్తిడి, నిద్రలేమి తదితర సందర్భాలతోపాటు.. మారుతున్న వాతావరణం సమయంలో కూడా తలనొప్పి వస్తుంది.. కానీ ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే అది అనేక వ్యాధుల లక్షణం కావచ్చు. దీనిని విస్మరించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుధీర్ఘకాలంపాటు తలనొప్పి ఉంటే ఇది అనేక వ్యాధుల లక్షణం కావచ్చని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ కవల్జిత్ సింగ్ తెలిపారు.. వాస్తవానికి తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య అని చెప్పారు. ఇది అందరికీ ఏదో ఒక సమయంలో వస్తుందని పేర్కొన్నారు.
చాలా కాలం పాటు తలనొప్పి కొనసాగితే అది ఈ వ్యాధుల లక్షణం కావచ్చు..
మైగ్రేన్..
సుధీర్ఘమైన తలనొప్పి మైగ్రేన్ లక్షణం అని డాక్టర్ సింగ్ వివరించారు. మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి.. ఇది సాధారణంగా ఒక వైపు సంభవిస్తుంది. తీవ్రమైన నొప్పితో వస్తుంది. ఇది ఎప్పుడైనా రావొచ్చు.. పురుషుల కంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందికి టెన్షన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఆందోళన, ఒత్తిడితో వచ్చే తలనొప్పి, ఇది సాధారణంగా రెండు వైపులా సంభవిస్తుంది.. సాధారణం నుంచి తీవ్రమైన నొప్పితో వస్తుంది.
సైనసిటిస్ వ్యాధి..
సైనసైటిస్ కూడా చాలా సాధారణమైన వ్యాధి. దీని వల్ల ముక్కులో అసౌకర్యం కలుగుతుంది. ఈ వ్యాధి సైనస్‌తోపాటు తలనొప్పికి కూడా కారణమవుతుంది. సిస్టిటిస్ లాంటి మరొక వ్యాధి ఉంది, దీనిని మెనింజైటిస్ అంటారు. మెనింజైటిస్ అనేది మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలంలో సంభవించే ఒక రకమైన ఇన్ఫెక్షన్.. ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది. సైనసైటిస్ వ్యాధిని మందులతో నియంత్రించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో రోగికి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు..
అధిక రక్తపోటు లక్షణం..
అధిక రక్తపోటు వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలను సులభంగా గుర్తించలేము. అయితే, మీరు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే, మీరు మీ రక్తపోటును తనిఖీ చేసుకోవాలి. అధిక రక్తపోటు కారణంగా చాలా మందికి ఎప్పుడూ తలనొప్పి వస్తుంది.
మెదడు కణితి
బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో సంభవించే ఒక రకమైన కణితి.. ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది. తలనొప్పితో పాటు, తల తిరగడం, దృష్టి మసకబారడం, శరీర సమతుల్యతలో ఇబ్బంది ఉంటే, అది బ్రెయిన్ ట్యూమర్ లక్షణం. దీనిని ఎప్పుడూ విస్మరించకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




