AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Cancer: మీరు అధికంగా మద్యం, పొగాకు అలవాటు ఉందా..? ఈ క్యాన్సర్‌ బారిన పడొచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త..!

Neck Cancer: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వరుసగా ఐదు లక్షలకుపైగా మెడ క్యాన్సర్‌ కేసులు, 2 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి విషయాలలో..

Neck Cancer: మీరు అధికంగా మద్యం, పొగాకు అలవాటు ఉందా..? ఈ క్యాన్సర్‌ బారిన పడొచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త..!
Head Neck Cancer
Subhash Goud
|

Updated on: Jul 28, 2022 | 12:18 PM

Share

Neck Cancer: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వరుసగా ఐదు లక్షలకుపైగా మెడ క్యాన్సర్‌ కేసులు, 2 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. అవగాహన పెంచుకుంటే క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా అప్రమత్తం కావచ్చు. గ్లోబోకాన్‌ 2020 ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2,52,772 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు నవీ నవీ ముంబైలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ఆంకాలజీ సర్వీసెస్ హెడ్ అండ్ నెక్ ఆంకోసర్జన్, డైరెక్టర్ డాక్టర్ అనిల్ డిక్రూజ్ TV9కి తెలిపారు.

గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS) డేటా ప్రకారం, స్త్రీల కంటే పురుషులే ఎక్కువ పొగాకును వినియోగిస్తున్నారు. అందువల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. పొగాకు సంబంధిత క్యాన్సర్లు మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, థైరాయిడ్ వంటి కొన్ని క్యాన్సర్లు సాధారణంగా మహిళల్లో సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీనికి కారణాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి

దీనికి ప్రధాన కారణాలు ముఖ్యంగా పొగాకు, మితిమీరిన మద్యపానం. ఇది కాకుండా ఓరోఫారింక్స్ (టాన్సిల్స్, నాలుక)ను ప్రభావితం చేసే HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) క్యాన్సర్. ఇది ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తున్నా మన దేశంలో కూడా పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఓరల్ సెక్స్ వల్ల HPV సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి

మెడ క్యాన్సర్‌ లక్షణాలు ఏమిటి?

1. నోటిలో ఇన్ఫెన్‌, రంగు మారడం

2. మెడలో వాపు

3. నోరు బొంగురుపోవడం

4. మింగడానికి ఇబ్బందిగా ఉండటం, మింగేటప్పుడు గొంతులో నొప్పి

5. నాసికా రక్తస్రావం లేదా

6. ముఖం వాపు,దంతాలు బలహీనపడటం

ఇలాంటి క్యాన్సన్‌ లక్షణాలను ముందుగా గుర్తిస్తే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణుడు. నొప్పి సాధారణంగా వ్యాధి ప్రారంభ దశలలో కనిపించదు. ముందస్తుగా గుర్తించడానికి దాని సంకేతాల గురించి అవగాహన ముఖ్యం.

1. నోటిలో తెలుపు రంగుగా ఉండటం, ఎరుపు మచ్చలు

2. పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు

ఎలా నిరోధించవచ్చు?

పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన అవగాహన చేసుకోవడంతో పాటు వాటిని పాటించినప్పుడు క్యాన్సర్ల బారి నుంచి రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. పొగాకు వినియోగాన్ని నిలిపివేయడం లేదా డి-అడిక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్యకరమైన జీవనశైలి, సురక్షితమైన లైంగిక వ్యవస్థ ద్వారా HPV క్యాన్సర్‌ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.