Child Care Tips: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఈ వ్యాధులు కారణం కావచ్చు..

Child Care Tips: పిల్లల ఎత్తు వారసత్వ పరంగా సంక్రమించే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అయితే, అసాధారణంగా తక్కువ ఎత్తు..

Child Care Tips: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఈ వ్యాధులు కారణం కావచ్చు..
Short And Tall
Follow us

|

Updated on: Jul 28, 2022 | 7:07 AM

Child Care Tips: పిల్లల ఎత్తు వారసత్వ పరంగా సంక్రమించే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అయితే, అసాధారణంగా తక్కువ ఎత్తు పెరగడానికి మాత్రం పిల్లల జన్యువులలో మార్పులే కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది వారి ఎత్తు పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కుటుంబంలో అసాధారణంగా ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు, తక్కువ ఎత్తుకు కారణం తెలియని పిల్లల కోసం ఎక్సోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష చేస్తారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ ఇటీవల అసాధారణంగా తక్కువ ఎత్తు ఉన్న పిల్లలపై పరిశోధన నిర్వహించింది.

ఈ అధ్యయన నివేదికను.. ఇటీవల ఇండియన్ పీడియాట్రిక్స్ ఎడిషన్‌లో ప్రచురించారు. 1 జనవరి, 2017 నుండి 31 అక్టోబర్, 2018 వరకు ఆసుపత్రికి వచ్చిన 455 మంది పిల్లలు(10 నెలల నుంచి 16 సంవత్సరాల వయసు వారు) పై పరిశోధన జరిపారు.

సర్ గంగా రామ్ హాస్పిటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ చైర్‌పర్సన్ డాక్టర్ రత్న దువా పూరి మాట్లాడుతూ.. “ఈ పరిశోధనలో, ఇతర కారణాలతో పాటు అసాధారణంగా తక్కువ ఎత్తు ఉన్న పిల్లల్లో ఒక కారణాన్ని మేము కనుగొన్నాము. వాటిలోని జన్యుపరమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాం.’’ అని చెప్పారు.

ఎత్తు అనేది జన్యులపై ఆధారపడి ఉంటుందా? ఏ వ్యక్తి అయినా ఎత్తుగా ఉండటానికి, తక్కువ ఎత్తు ఉండటానికి ప్రధాన కారణం జన్యుపరమైనదే నని డాక్టర్ దువా తెలిపారు. ఇలాంటి మోనోజెనిక్ డిజార్డర్స్ చాలా ఉన్నప్పటికీ.. దీని వల్ల శరీర ఎదుగుదల సరిగా జరగదన్నారు. సరైన వైద్య పరీక్షల ద్వారా ఎత్తు తక్కువగా ఉండడానికి గల కారణాన్ని గుర్తించవచ్చని తమ అధ్యయనంలో తేలిందన్నారు. తాము చేసిన అధ్యయనంలో 65% మంది పిల్లలలో అసాధారణమైన తక్కువ ఎత్తుకు కారణం క్లినికల్ పరీక్ష ద్వారా కనుగొనడం జరిగిందని, మిగిలిన వాటిలో క్లినికల్ ప్రొఫైల్ ప్రకారం అదనపు జన్యు పరీక్షలు జరిగాయని డాక్టర్ దువా వివరించారు.

‘‘ఈ అధ్యయనంలో 455 మంది పిల్లలను పరీక్షించడం జరిగింది. వీరందరి ఎత్తు చాలా తక్కువ. వీరిలో, 226 మంది పిల్లల్లో వివరణాత్మక జన్యు పరీక్ష, ఫినోటైపింగ్ ద్వారా కారణాల కోసం పరిశోధించగా, 229 మందిలో ప్రాథమిక చరిత్ర, శారీరక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పిల్లలలో 63% మందిలో పొట్టిగా ఉండటాన్ని కనుగొనడం జరిగింది. వీరిలో 65% మందికి టర్నర్ సిండ్రోమ్, విలియం సిండ్రోమ్, రెసోపతిస్ వంటి జన్యుపరమైన వ్యాధులు ఉన్నట్లు గుర్తించాం.’’ అని డాక్టర్ దువా వెల్లడించారు.

‘‘226 మందిలో మిగిలిన 84 మంది పిల్లలలో పొట్టిగా ఉండటాన్ని గుర్తించాం. వీరిలో 45% మందికి లైసోసోమల్ స్టోరేజ్ జెనెటిక్ డిజార్డర్ ఉంది. అదే సమయంలో, 44% పిల్లలలో అస్థిపంజరానికి సంబంధించిన డైస్ప్లాసియాస్ గుర్తించాం. 8% (9) పిల్లలలో ఎలాంటి కారణం లభించలేదు.’’ అని తెలిపారు.

పిల్లల ఎత్తు చిన్నగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.. కుటుంబంలోని బిడ్డ అసాధారణంగా ఎత్తు తక్కువగా ఉండి, శరీర ఎదుగుదల మందగించినట్లయితే వెంటనే వైద్య నిపుణుల అభిప్రాయం తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్ రత్న దువా సూచించారు. ఈ రోజుల్లో జన్యు రంగంలో అనేక కొత్త పరీక్షలు వచ్చాయని, వాటి ధర కూడా చాలా తక్కువేనని తెలిపారు. సరైన జన్యుపరమైన పరీక్షతో కారణాన్ని గుర్తించవచ్చునని, చికిత్స చేయవచ్చునని అన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..