Eye Care Tips: మీరు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. అద్భుతమైన ఫలితాలు..!

Eye Care Tips: ప్రస్తుతం కంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు రావడంతో ఆన్‌లైన్‌ క్లాసులు, ఎక్కువగా మొబైల్‌ ఆపరేటింగ్‌..

Eye Care Tips: మీరు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. అద్భుతమైన ఫలితాలు..!
Eye Care Tips
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2022 | 12:06 PM

Eye Care Tips: ప్రస్తుతం కంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు రావడంతో ఆన్‌లైన్‌ క్లాసులు, ఎక్కువగా మొబైల్‌ ఆపరేటింగ్‌ చేస్తుండటం, ఉద్యోగాలు చేసేవారు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌లాప్‌ల ముందు కూర్చోవడం వల్ల కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చే ఆహారాలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర విటమిన్స్‌ కలిగివున్న పదార్థాలను తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి కంటి అద్దాలను వాడాల్సిన పరిస్థితి వస్తోంది. కంటి చూపును మెరుగు పర్చుకునేందుకు ఆయుర్వేద నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

  1. పాలకూర: ఆకు కూరలు కంటి చూపునకు ఎంతో మంచిదనే విషయం అందరికి తెలిసిందే. వైద్యులు కూడా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని సిఫారసు చేస్తుంటారు. ఇందులో భాగంగా పాలకూ, బచ్చలికూర లాంటి వివిధ రకాల ఆకు కూరలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పర్చుకోవాచ్చంటున్నారు. ఇకపోతే పాల కూరలో విమిన్టుల, మినరల్స్‌ అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు, యాంటి ఇక్సిడెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కంటి సమస్య ఉన్న వారిలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు కంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
  2. డ్రై ఫ్రూట్స్‌: రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడేవి డ్రైఫ్రూట్స్‌. ఇవి రుచిగా ఉండటమే కాకుండా కంటిచూపును సైతం మెరుగు పరుస్తాయి. కంటి సమస్యలను సైతం పారద్రోలుతాయి. ఇందులో విటమిన్‌ -ఇ, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల కంటి చూపును మెరుగు పర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
  3. నారింజ: కంటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు నారింజ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను పరిష్కరిస్తుంది. నారింజ పండు మీ కంటి రెటీనాకు అవసరమయ్యే విటమిన్‌-ఏను అందిస్తాయి.
  4. పొద్దు తిరుగుడు విత్తనాలు: కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు కంటి వైద్య నిపుణులు. ఇందులో ప్రోటీన్స్‌, హెల్త్‌ కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయట. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఉపయగపడుతుంది.
  5. క్యారెట్‌ జ్యూస్‌: కంటికి మేలు చేకూర్చే క్యారెజ్‌జ్యూస్‌. ఇందులో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది కళ్లకు ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఉదయాన్నే పరగడుపున క్యారెట్‌ జ్యూస్‌ తాగినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. క్యారెట్‌ జ్యూస్‌ కంటి సమస్యలను తీర్చడంలో ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే కంటి వైద్యులను సంప్రదించండి.)