Police Deaths : ఉన్నట్టుండి కుప్పకూలిపోతోన్న పోలీస్‌లు, నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఉదంతాలు

వాకింగ్ చేస్తూ ఇద్దరు పోలీసులు గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో కానిస్టేబుల్, గుంటూరులో సీఐ వాకింగ్ చేస్తూ ఒకే రోజు హఠాన్మరణం చెందారు...

Police Deaths : ఉన్నట్టుండి కుప్పకూలిపోతోన్న పోలీస్‌లు, నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఉదంతాలు
Ci Death
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 28, 2021 | 6:47 PM

Police Deaths : వాకింగ్ చేస్తూ ఇద్దరు పోలీసులు గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో కానిస్టేబుల్, గుంటూరులో సీఐ వాకింగ్ చేస్తూ ఒకే రోజు హఠాన్మరణం చెందారు. రీసెంట్ గా రాజమండ్రిలో షటిల్ ఆడుతూ ఒక సీఐ చనిపోయారు. మార్చి నెలలో షెటిల్ ఆడుతూ సీఐ భగవాన్ ప్రసాద్ కోర్టులోనే కుప్పకూలిపోయారు. ఫిట్ నెస్‌తో ఉండే పోలీసులే ప్రాణాలు ఎలా కోల్పోతున్నారు.? కరోనా వచ్చి పోయాక శరీరంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందా? అనే సందేహాలకు తెర లేస్తోంది.

కాగా, గుంటూరుజిల్లాలో ఈ ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన సీఐ శ్రీధర్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. మంగళగిరిలోని CID హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే ఆయన.. ఎప్పట్లానే గుజ్జనగుండ్లలో వాకింగ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో స్ట్రోక్ వచ్చింది. కూర్చున్నచోటే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణం పోయింది. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీధర్‌ రెడ్డి మరణాన్ని తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పనిచేసిన ప్రతి చోట మంచిపేరు తెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు.

ఇటు, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న కానిస్టేబుల్ కూడా గుండెపోటుకు గురై ఉన్నఫళంగా కుప్పకూలిపోయి క్షణాల్లోనే ప్రాణాలొదిలారు. ఇటీవల మార్నింగ్ వాక్‌ పూర్తి చేసుకున్న సీఐ.. షటిల్‌ ఆడుతూ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సీఐ భగవాన్‌ ప్రసాద్‌ ప్రాణాలు కోల్పోయిన తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు భగవాన్ ఉత్సాహంగా ఉన్నారు.

మిత్రులతో కలిసి షటిల్‌ ఆడుతున్నారు. సడెన్‌గా కింద పడిపోయారు. కనీసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుక టైమ్‌ కూడా లేకుండా పోయింది. షటిల్ కోర్టులోనే కింద పడిపోవడం.. ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయాయి. అయితే, ఇటీవల కాలంలో పోలీస్ ల అకాల మరణాలు ఎందుకు జరుగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. కరోనా సోకిన అనంతరం ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయా అన్నది మరో సంశయంగా మారింది.

Read also : Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు