Guava Health Benefits: జామ, ఆకులతో ఇన్ని ఉపయోగాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పూర్తి వివరాలు..!

Guava Health Benefits: ప్రస్తుతం మారుతున్నకాలానుగుణంగా వివిధ వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, పీల్చే గాలి, మానసిక ఆందోళన..

Guava Health Benefits: జామ, ఆకులతో ఇన్ని ఉపయోగాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు.. పూర్తి వివరాలు..!
Guava Health Benefits
Follow us

|

Updated on: Oct 09, 2021 | 12:56 PM

Guava Health Benefits: ప్రస్తుతం మారుతున్నకాలానుగుణంగా వివిధ వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, పీల్చే గాలి, మానసిక ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిళ్లు, నిద్రలేమితనం తదితర కారణాల వల్ల జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడేది మన చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లు కూడా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని ఆస్తులున్నా.. ఆరోగ్యంగా లేకపోతే కష్టమే.

అయితే కొన్ని మాత్రం పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారి సలహాలు, సూచనల ప్రకారం.. ఇక సామాన్యుడికి చౌకగా దొరికే పండ్లల్లో జామ ఒకటి. జామకాయలో ఎన్నో పోషకాలున్నాయి. జామతో ఎలాంటి లాభాలుంటాయో తెలిస్తే అస్సలు వదలరు. జామ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషధంలా పని చేస్తుంది. అలాగే ప్రస్తుతం డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం. రక్తంలో షుగర్స్‌ లేవల్స్‌ను తగ్గించేస్తుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

► జామలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్‌ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.

► ఇందులోఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి.

► జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

► ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది. ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

► జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

► జామ వల్ల బీపీ పెరగకుండా ఉంటుంది. జామలో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది.

► జామలో విటమిన్‌-సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.

► మనం తినే ఆహారం నుంచి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల మెదడు పనితీరు ఎంతో మెరుగు పడుతుంది.

► కాన్సర్ వస్తే.. దానిని వదిలించుకోవడం ఓ సాహసమే అని చెప్పాలి. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలు అధికంగా ఉన్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే… జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది.

గుండెకు మేలు:

గుండెను కాపాడుతుంది. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్ వంటివి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి.

జామ పండ్ల ఆకుల రసం తాగితే..

మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే ఎంతో మంచిది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకులను నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో..

పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇక జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. మలబద్ధకం ఉన్న వారికి జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక జామకాయ మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Silicosis: సిలికోసిస్ వ్యాధి గుర్తించడానికి ఐసీఎంఆర్ కొత్త టెస్ట్ కిట్.. ఈ వ్యాధి గురించి తెలుసుకోండి!

Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్లను జయించే చిట్కాలు..!

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు