Breast Cancer: అత్యంత సాధారణ క్యాన్సర్ గా రొమ్ము క్యాన్సర్.. ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు అత్యంత సాధారణ క్యాన్సర్‌గా మారింది. గత 20 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సర్వసాధారణం, కానీ ఇప్పుడు అది రెండవ స్థానంలో ఉంది.

Breast Cancer: అత్యంత సాధారణ క్యాన్సర్ గా రొమ్ము క్యాన్సర్.. ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Breast Cancer Awareness
Follow us

|

Updated on: Oct 09, 2021 | 1:35 PM

Breast Cancer Awareness: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు అత్యంత సాధారణ క్యాన్సర్‌గా మారింది. గత 20 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సర్వసాధారణం, కానీ ఇప్పుడు అది రెండవ స్థానంలో ఉంది. రొమ్ము క్యాన్సర్ కేసులు 2020 లో 23 లక్షలు నమోదయ్యాయని, ఇది మొత్తం కేసుల్లో 12 శాతం అని డబ్ల్యూహెచ్‌ఓ క్యాన్సర్ నిపుణుడు ఆండ్రీ ఇల్బావి చెప్పారు. ఇది మహిళల్లో అత్యధిక సంఖ్యలో క్యాన్సర్ కేసులకు కారణం. డబ్ల్యుహెచ్వో ఈ నివేదికను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 న జరుపుకునే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి ముందు విడుదల చేసింది. నివేదిక ప్రకారం, మూడవ స్థానంలో కొలొరెక్టల్ క్యాన్సర్ ఉంది.

మహిళల్లో స్థూలకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని క్యాన్సర్ నిపుణుడు ఆండ్రీ ఇల్బావి చెప్పారు. మహిళల్లో స్థూలకాయం రొమ్ము క్యాన్సర్‌కు అత్యంత సాధారణ ప్రమాద కారకం. ఇది క్యాన్సర్ కేసులను పెంచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు వయస్సు పెరుగుతోంది. కానీ, క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 2020 లో, సుమారు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2040 నాటికి, ఈ సంఖ్య 3 కోట్లకు చేరుకుంటుంది.

ఆండ్రీ ఇల్బావి ప్రకారం, కరోనా మహమ్మారి క్యాన్సర్ రోగులపై చెడు ప్రభావాన్ని చూపింది. క్యాన్సర్ రోగుల చికిత్స అదేవిధంగా పరిశోధనకు అంతరాయం కలిగింది.

రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు కాన్సర్ అంటే ఏమిటి

డబ్ల్యుహెచ్వో నివేదికలో, రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ స్థానంలో అదేవిధంగా పెద్దప్రేగు క్యాన్సర్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ క్యాన్సర్లు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉంటాయి? ఏ లక్షణాలు వాటికి ఎక్కువగా ఉంటాయి? వాటిని ఎలా నివారించాలి బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా నెల సందర్భంగా ఇప్పుడు ఇది తెలుసుకుందాం.

బ్రెస్ట్ క్యాన్సర్: రొమ్ములో ఒక గడ్డ లేదా పరిమాణంలో మార్పు ఈ క్యాన్సర్ లక్షణం

ప్రపంచంలోని చాలా క్యాన్సర్ కేసులు రొమ్ముకు సంబంధించినవి, కాబట్టి దీని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వైద్య నిపుణులు ఊబకాయం పెరగడం, బిడ్డకు పాలివ్వకపోవడం అదేవిధంగా వ్యాయామానికి దూరం కావడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు దీనిని నివారించాలనుకుంటే, ధూమపానం, ఆల్కహాల్, హార్మోన్ థెరపీ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

20 సంవత్సరాల వయస్సు నుండి మీ ఛాతీని తనిఖీ చేయండి. మీరు రొమ్ముల్లో గడ్డలు, పరిమాణంలో మార్పు.. ద్రవం బయటకు రావడం వంటి లక్షణాలను చూసినట్లయితే, అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి. 40 ఏళ్ల తర్వాత, సంవత్సరానికి ఒకసారి మామోగ్రఫీ చేయించుకోండి. ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఆహారంలో పండ్లు, కూరగాయల మొత్తాన్ని పెంచండి.

ఊపిరితిత్తుల క్యాన్సర్: సుదీర్ఘమైన దగ్గు- వాయిస్‌లో మార్పు దాని లక్షణాలు

ఇది ఊపిరితిత్తులలో వచ్చే క్యాన్సర్. ఎక్కువసేపు దగ్గు, శ్లేష్మం లేదా శ్లేష్మంతో రక్తం వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. ఇది కాకుండా, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, వాయిస్‌లో మార్పు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు. మీరు అలాంటి మార్పులను గమనించినట్లయితే, వెంటనే వైద్య సలహా తీసుకోండి.

అటువంటి సందర్భాలలో, ఛాతీ ఎక్స్-రే, హెచ్ స్కాన్, ఊపిరితిత్తుల బయాప్సీ లేదా బ్రోంకోస్కోపీని సిఫార్సు చేస్తారు.

పెద్దప్రేగు కాన్సర్: మీకు మలబద్ధకం లేదా అతిసారం ఎక్కువకాలం ఉంటే అప్రమత్తంగా ఉండండి

దీనిని కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో లేదా వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా కలిగి ఉంటే. ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే అలవాటు, ఆహారంలో పీచు లేకపోవడం, మధుమేహం, ధూమపానం అదేవిధంగా ఆల్కహాల్ ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

మలబద్ధకం లేదా అతిసారం చాలా కాలం పాటు కొనసాగితే, అప్పుడు వైద్య సలహా తీసుకోండి. అలాంటి లక్షణాలు కనిపిస్తే, కోలొనోస్కోపీ, బయాప్సీ, CT స్కాన్ లేదా MRI ద్వారా అది క్యాన్సర్ అవునా.. కాదా అని తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?