Guava Benefits: ఒక్క జామ కాయ.. ఎంత మేలు చేస్తుందో తెలుసా..? రోజూ తింటే ఆ సమస్యలే దరిచేరవు..
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. ఇది తినడానికి రుచిగా ఉండటంతోపాటు.. శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి.
చలికాలం వచ్చేసింది.. మార్కెట్‌లో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇంకా వీటి ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. ఇది తినడానికి రుచిగా ఉండటంతోపాటు.. శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. జామ పండును పిల్లలు, పెద్దలు ఇష్టంతో తింటారు. ఇంకా జమతో పిల్లలకు జెల్లీ, జామ్, మురబ్బా వంటివి చేసి ఇవ్వవచ్చు.
- రోగనిరోధకశక్తి పెరుగుతుంది: జామపండులో విటమిన్ సి , లైకోపీన్ యాంటీ యాక్సీడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు.. రోజూ ఒక్క జామ కాయ తింటే వెంటనే పెరుగుతుందని.. ఇంకా ఉదర సమస్యలకు దివ్య ఔషధం అని పేర్కొంటున్నారు.
- కాన్సర్ కణాలను నిరోధిస్తుంది: జామలోని మెగ్నీషియం.. మనం తీసుకునే ఆహార పదార్ధాలలోని పోషకాలను సరిగా స్వీకరించటానికి సహకరిస్తుంది. యాంటీ యాక్సిడెంట్స్ ప్రీరాడికల్స్‌ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇంకా వీటినిలోని ఔషధగుణాలు కాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి.
- రక్తపోటు దూరం: ఎక్కువ పీచు, సోడియం పొటాషియం నిల్వలను సమన్వయ పరిచి రక్త పోటును అదుపులో ఉంచుతాయి. ఇందులోని పోషకాలు ట్రైగ్లి రాయిడ్స్ చేడు కొవ్వును తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- జీర్ణ సమస్యలు దూరం: డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
- కంటిచూపు మెరుగుపడుతుంది: జామపండులో లభించే విటమిన్ -ఎ కంటిచూపు మెరుగుపడేలా చేస్తుంది. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో లభించే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు మేలు చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి