Food Safety: ఆహారాల్లో కృత్రిమ రంగుల వాడకంపై కలవరం..! ఎంత ప్రమాదమో తెలుసా..

ఇటీవల బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్, ఫిష్, వెజ్ కబాబ్‌ వంటి ఆహాకాలంలొ కలర్‌ను ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. కబాబ్‌లు, చేపలు, చికెన్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించడానికి అసలు కారణం ఏమిటి ? ఆహారంలో ఉపయోగించే ఈ రంగులు..

Food Safety: ఆహారాల్లో కృత్రిమ రంగుల వాడకంపై కలవరం..! ఎంత ప్రమాదమో తెలుసా..
Artificial Food Colors
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:28 PM

ఇటీవల బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్, ఫిష్, వెజ్ కబాబ్‌ వంటి ఆహాకాలంలొ కలర్‌ను ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. కబాబ్‌లు, చేపలు, చికెన్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించడానికి అసలు కారణం ఏమిటి ? ఆహారంలో ఉపయోగించే ఈ రంగులు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది ఎంత ప్రమాదకరమైనది? అనే విషయాలు బెంగళూరులోని ఆహార నిపుణుడు డాక్టర్ కీర్తి హిరిసావే మాటల్లో మీకోసం..

డాక్టర్ కీర్తి హిరిసావే మాట్లాడుతూ.. ‘ఆహార తయారీలో కృత్రిమ రంగులు రుచిని పెంచడంతో పాటు ఆకర్షణీయ రంగును పులుముతాయి. దీంతో ఆహారం కళ్ళకు ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది. కృత్రిమ రంగుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చికెన్‌ కబాబ్‌ల నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపగా.. అందులో ఎనిమిది కబాబ్‌లకు కృత్రిమ రంగులు వేసినట్లు గుర్తించారు. మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్ చాలా ప్రమాదకరం. కృత్రిమ రంగుల్లో కార్మోసిన్ అనే పదార్ధం ఉంటుంది. కార్మోసిన్ కూడా ఒక రసాయన కారకం. కార్మోసిన్ ఆహారాన్ని ఎరుపుగా మారుస్తుంది. ఈ కార్మోసిన్ కిడ్నీలను దెబ్బతీస్తాయి. ఆహారంలో 100pp కంటే ఎక్కువ కార్మోసిన్ వాడితే, ఆహారం చాలా ఎర్రగా కనిపిస్తుంది. అంతే కాకుండా కార్మోసిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చిన్నవయసులోనే పిల్లలకు బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనితోపాటు గుండెపోటుతో సహా అనేక సమస్యలు దారితీస్తాయని’ డాక్టర్ కీర్తి హెచ్చరించారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ కలర్స్‌పై నిషేధం విధించడంతోపాటు.. నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles