AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Fever: జ్వరం వెంటనే తగ్గాలంటే ఈ ట్రిక్స్ పాటించండి!

వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరం అనేది చిన్నవారికైనా, పెద్దవారికైనా కామన్‌గా వస్తూ ఉంటుంది. కొంత మందికి అన్ సీజన్‌లో కూడా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి శరీరలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కూడా జ్వరం ఎటాక్ చేస్తుంది. జ్వరం వచ్చిందంటే ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. నోరంతా చేదుగా, ఏ పనీ చేయాలని అనిపించదు. కానీ జ్వరంలో ఉన్నప్పుడు హెల్దీ ఆహారం తీసుకోవాలి. జ్వరం అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఎలాంటి కారణాల వల్ల ఫీవర్ వచ్చినా..

Tips for Fever: జ్వరం వెంటనే తగ్గాలంటే ఈ ట్రిక్స్ పాటించండి!
Fever
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 15, 2024 | 1:15 PM

Share

వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరం అనేది చిన్నవారికైనా, పెద్దవారికైనా కామన్‌గా వస్తూ ఉంటుంది. కొంత మందికి అన్ సీజన్‌లో కూడా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి శరీరలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కూడా జ్వరం ఎటాక్ చేస్తుంది. జ్వరం వచ్చిందంటే ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. నోరంతా చేదుగా, ఏ పనీ చేయాలని అనిపించదు. కానీ జ్వరంలో ఉన్నప్పుడు హెల్దీ ఆహారం తీసుకోవాలి. జ్వరం అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఎలాంటి కారణాల వల్ల ఫీవర్ వచ్చినా.. ఓ నాలుగు రోజుల వరకు మాత్రం నీరసంగా ఉంటుంది. అయితే జ్వరం వచ్చిన వారు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. వెంటనే అదుపులోకి వస్తుంది. మరి అవేంటో? ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి..

జ్వరంలో ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. శరీరంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. సాక్సులను చల్లటి నీటిలో తడిపి బాగా పిండాలి. వాటిని కాళ్లకు వేసుకోవాలి. అలాగే దుప్పటి కాళ్లపై కప్పుకుని పడుకోవాలి. ఇలా చేస్తే శరీరంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు ఇలా చేస్తే.. వారిలో జ్వరం తగ్గి.. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

నీటితో నుదుటిపై పెడుతూ ఉండాలి..

శరీరంలో వేడి తగ్గాలంటే.. చిన్న చిన్న కర్చీఫ్స్ లేదా నాప్ కిన్స్‌తో నుదుటిపై పెడుతూ ఉండాలి. అలాగే కాలి మడమలు, మెడ భాగాల్లో ఉంచడం వల్ల జ్వరం కంట్రోల్‌లోకి వస్తుంది. కంటిన్యూగా ఇలాగే చేస్తూ ఉంటే జ్వరం అదుపులోకి వస్తుంది. ఇదే టిప్ చిన్నారులకు కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

తక్కువగా తినాలి..

జ్వరంగా ఉంటే ఏమీ తినాలని అనిపించదు. అయితే కొంత మందికి మాత్రం ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీంతో జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేస్తూ ఉంటారు. జ్వరంలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటే.. ఆ ఆహారం జీర్ణం కాదు. తిన్నది జీర్ణం చేయడానికి శరీరం మరింత కష్ట పడాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువగా తినడమే మంచిది.

పండ్లు ఎక్కువగా తీసుకోవాలి..

జ్వరంగా ఉన్నప్పుడు పండ్లు, జ్యూస్‌లు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటే జ్వరంతో పోరాడే శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. చికెన్ సూప్ వంటివి తాగితే ఇంకా మంచిది. ఇన్ ఫెక్షన్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. చికెన్ సూప్ తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.