Diwali 2022: దీపావళి పటాసులతో చర్మం కాలిందా? అయితే ఈ పనులు అసలు చేయకండి..

|

Oct 25, 2022 | 12:37 PM

కాలిన గాయాలకు కొంతమంది వెన్న రాస్తుంటారు. బేకింగ్ సోడా పోస్తుంటారు. ఆయింట్మెంట్ రాయడం, బాడీలోషన్ తో పాటు నూనెలు రాయడం లాంటి పనులు కూడా చేస్తుంటారు. అయితే ఈ పద్ధతులన్నీ చర్మానికి హానికరమంటున్నారు నిపుణులు.

Diwali 2022: దీపావళి పటాసులతో చర్మం కాలిందా? అయితే ఈ పనులు అసలు చేయకండి..
Skin Burns
Follow us on

దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు తయారుచేసుకుని కుటుంబీకులు, బంధువులతో విందులు, వినోదాల్లో పాల్గొన్నారు. ఇక దీపావళి అంటేనే పటాకుల పండగ. ఈ పర్వదినాన చిన్నా పెద్దా అందరూ క్రాకర్స్ పేల్చుతారు. ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేందుకు బాగా ఆసక్తి చూపుతారు. అయితే పటాకులు పేల్చేటప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులకు కాలిన గాయాలు బాగా తగులుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలామంది అలక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ గాయాలను తేలికగా తీసుకుంటారు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతో గాయాలను మాన్పించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందేందుకు టూత్ పేస్ట్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతి చర్మానికి మరింత నష్టం కలిగిస్తుంది. అదేవిధంగా కొంతమంది వెన్న రాస్తుంటారు. బేకింగ్ సోడా పోస్తుంటారు. ఆయింట్మెంట్ రాయడం, బాడీలోషన్ తో పాటు నూనెలు రాయడం లాంటి పనులు కూడా చేస్తుంటారు. అయితే ఇవన్నీ మంచి పద్ధతులు కాదంటున్నారు నిపుణులు.

చర్మం కాలినప్పుడు ఇలా చేయకండి..

చర్మం కాలిపోయినప్పుడు బాగా రక్తస్రావం అవుతుంటే వైద్య నిపుణుల సలహాలు తీసుకుని వెంటనే కట్టుకట్టాలి. అలాగే ఉంచితే సూక్ష్మజీవులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే డాక్టర్లు సూచన మేరకు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. క్రాకర్స్ వల్ల లేదా మరేదైనా కారణాల వల్ల చిన్న పిల్లల చర్మం కాలిపోతే, ఈ పరిస్థితిలో ఇంటి నివారణలు తీసుకోకుండా, నేరుగా పిల్లల నిపుణుల వద్దకు తీసుకెళ్లండి. లేకపోతే పిల్లల సున్నితమైన చర్మానికి మరింత హాని కలుగుతుంది. మీరు స్కిన్ బర్న్స్ కోసం ఇంటి నివారణలను అనుసరించాలనుకుంటే, అలోవెరా జెల్ సహాయం తీసుకోండంటున్నారు నిపుణులు. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్, ఇతర గుణాలు కాలిన గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. చర్మంపై కాలిన బొబ్బలు ఉంటే వెంటనే తేనెతో కూడిన హోం చిట్కాను ఉపయోగించండి. ఇందుకోసం ముందుగా తెల్లటి కట్టుపై తేనె వేసి, నేరుగా కాలిన ప్రదేశంలో ఉంచండి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేస్తూ ఎప్పటికప్పుడు బ్యాండేజీని మార్చుకోవాలి.

చల్లటి నీళ్లతో ఉపశమనం..

ఇక కట్టు కట్టేటప్పుడు మెత్తగా గాయానికి అతుక్కోకుండా ఉండే బ్యాండేజీ మాత్రమే తీసుకొని ఉపయోగించాలి. కాలిన గాయాలపై వెంటనే చల్లటి నీటిని పోయడం ప్రారంభించాలి. ఇలా సుమారు కనీసం 10 నిమిషాలు చేయాలి. అయితే కాలిన చర్మంపై మంచుగడ్డలు ఉంచడం హానికరం. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించినా.. రక్తప్రసరణకు అడ్డుపడుతుంది. కాలిన గాయాలు తగిలినప్పుడు గాలి , వెలుతురు బాగా ఉన్న ప్రాంతంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎండలోకి వెళ్లకూడదు. చల్లని ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి