Health: అదే పనిగా రోజంతా తింటున్నారా.. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ కు రెడ్ కార్పెట్ పరచినట్లే
ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. శరీరానికి శక్తి అందించేందుకు ఆహారం ఎంతో అవసరం. ఎన్నో పోషక పదార్థాలు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తినేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొంత మంది మాత్రం పోషకాలతో సంబంధం...
ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. శరీరానికి శక్తి అందించేందుకు ఆహారం ఎంతో అవసరం. ఎన్నో పోషక పదార్థాలు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తినేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొంత మంది మాత్రం పోషకాలతో సంబంధం లేకుండా జంక్ ఫుడ్, స్నాక్స్, ఇలా ఏది దొరికితే అవి తినేస్తుంటారు. ఎప్పుడూ స్వీట్స్, హాట్స్ వంటి జంక్ ఫుడ్ ను నోట్లో ఆడిస్తూ ఉంటారు. రోజంతా ఏదో ఒకటి తినడం వల్ల మనకు తెలియకుండానే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినేది కొంచేమే కదా.. ఏమవుతుందిలే అని వదిలేస్తే అది భవిష్యత్ లో తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఏది పడితే అది తినడం మంచి పద్ధతి కాదు. సాధారణంగా మనం ఏదైనా తిన్నాక రెండు గంటల వరకు పళ్ల మీద ఎనామిల్ క్షీణిస్తూ ఉంటుంది. అందుకే భోజనం చేశాక పళ్లు తోముకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అలా చేయకుండా ఉంటే దంత సమస్యలు వస్తాయి. తినటం ప్రారంభించగానే రక్తంలో ట్రైగ్లిజరైడ్ల క్వాంటిటీ పెరుగుతుంది. ఫలితంగా రక్తం గడ్డ కట్టే స్వభావం పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం చిక్కబడి గడ్డ కడుతుంది. ఇది ఒక్కోసారి గుండె సమస్యలకూ దారి తీస్తుంది.
ఎక్కువగా ఆహారాన్ని తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. జంక్ ఫుడ్ తో కడుపు నిండిన భావన అనిపించదు. దీంతో మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తినేస్తూ ఉంటాం. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్ తింటే పోషకాహార లోపం వస్తుంది. మనం ఏదైనా తిన్నప్పుడు జీర్ణకోశానికి రక్తం ఎక్కువగా సరఫరా అవుతుంది. కండరాలు, మెదడుకు తక్కువగా అందుతుంది. అందువల్ల ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే రక్తసరఫరా వ్యవస్థ క్రమం అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి అదే పనిగా తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.