Rusk: రస్క్ తింటే హెల్త్ రిస్క్‌లో పడ్డట్టే.. ఆ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండాల్సిందే.. షాకింగ్ ఫ్యాక్ట్స్..

వేడి వేడిగా పొగలు కక్కే చాయ్.. దానికి తోడుగా రస్క్.. అబ్బా ఊహించుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ.. నిజమే మరి.. చాయ్ రస్క్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. అయితే.. రస్క్ తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు...

Rusk: రస్క్ తింటే హెల్త్ రిస్క్‌లో పడ్డట్టే.. ఆ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండాల్సిందే.. షాకింగ్ ఫ్యాక్ట్స్..
Side Effects Of Rusk
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 7:29 AM

వేడి వేడిగా పొగలు కక్కే చాయ్.. దానికి తోడుగా రస్క్.. అబ్బా ఊహించుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ.. నిజమే మరి.. చాయ్ రస్క్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. అయితే.. రస్క్ తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తయారు చేసే విధానంలో ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం వస్తువులు వాడడం వంటి కారణాలతో అనారోగ్యం వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఫలితంగా అతిసారం, ఫుడ్​ పాయిజనింగ్​, మలబద్ధకం వంటి వాటి బారినపడే ముప్పు ఉంటుందని తెలిపారు. వాస్తవానికి రస్క్ తయారీకి ప్రధాన ముడి పదార్థం బొంబాయి రవ్వ. కానీ మైదా పిండిని ఎక్కువ మోతాదులో, బొంబాయి రవ్వను తక్కువ మోతాదులో కలిపి బేకరీల్లో రస్క్​ను తయారు చేస్తున్నారు. అందుకే రస్క్ తిన్నాక.. జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతోంది. అంతేకాకుండా శరీర బరువు పెరిగేందుకు కారణమవుతోంది.

రస్క్ కు ఆ రంగు వచ్చేలా చేయడానికి క్యారమెల్​అనే ఫుడ్ కలర్ ను కలుపుతారు. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. రస్క్​ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేందుకు అందులో కొన్ని కెమికల్స్​వాడతారు. నాసిరకం నెయ్యి లేదా పామాయిల్స్​ను వాడుతున్నారు. తక్కువ రకం ఆయిల్​తో తయారు చేసే రస్క్​ను తింటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ముప్పు పెరుగుతుంది. గ్లూటెన్​అనేది రస్క్​లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. సెలియాక్​ వ్యాధిగ్రస్తులు రస్క్​ తింటే చిన్నపేగులు దెబ్బతినే ముప్పు ఉంటుంది.

రస్క్​తియ్యగా ఉండేందుకు అందులో రిఫైన్డ్ షుగర్​ను పెద్దమొత్తంలో వాడుతున్నారు. ఫుల్లుగా షుగర్​ఉండే రస్క్​ను మితిమీరి తింటే రక్తంలో షుగర్​ లెవల్స్ పెరిగిపోతాయి. చివరకు ఇది డయాబెటిస్​ వ్యాధికి దారితీస్తుంది. రస్క్​ను ఎక్కువగా తినేవారికి పెద్దపేగులో అల్సర్లు వచ్చే చాన్స్​ ఉంటుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. బ్రెడ్​ కంటే రస్క్​లో క్యాలరీ లెవల్స్​ఎక్కువ. నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం