Health: నోటి దుర్వాసనను భరించలేకపోతున్నారా.. ఈ నియమాలు పాటిస్తే చక్కటి ఆరోగ్యం మీ సొంతం
నోటి దుర్వాసన (Bad Breath) వస్తే ఎవరికైనా ఇబ్బందిగా అనిపించడం సాధారణమే. మనం తీసుకునే ఆహారం దంతాలు, చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు అక్కడ ఆహారం కుళ్లిపోయి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నోరు శుభ్రంగా...
నోటి దుర్వాసన (Bad Breath) వస్తే ఎవరికైనా ఇబ్బందిగా అనిపించడం సాధారణమే. మనం తీసుకునే ఆహారం దంతాలు, చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు అక్కడ ఆహారం కుళ్లిపోయి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నోరు శుభ్రంగా లేకపోవడం, పిత్త దోషం, అజీర్ణి కారణంగా నోటి దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి, ఉల్లి, పెరుగు తిన్నాక నోరు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాఫీ, టీ, సోడా, మద్యం, ధూమపానం వల్ల కూడా నోరు నుంచి తీవ్ర వాసన వస్తుంది. ఇది మనకే కాదు మన ఎదుటి వారికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత శుభ్రంగా నోటిని కడుక్కోవాలి. నోటి నిండా నీళ్లు పోసుకుని పుక్కిలించాలి. మంచి ఆరోగ్యాన్ని (Health Tips) సొంతం చేసుకోవడానికి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అవసరం. కాబట్టి ప్రాసెసింగ్ ఫుడ్, రెడ్ మీట్, వేపుళ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాత అసమతుల్యత వల్ల బలహీనత, అలసట, ముడతలు వస్తాయి. కాబట్టి శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మజ్జిగ, అల్లం, పసుపు వంటివి తీసుకుంటే బ్యాలెన్సింగ్ పెరుగుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శీతల పానియాలు తాగాలనిపిస్తుంది. కానీ అలాంటి సమయాల్లోనే మనం నియంత్రణలో ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి ఉదయం నిద్ర లేవగానే అర గ్లాసు క్యారెట్ జ్యూస్, అర గ్లాస్ దానిమ్మ జ్యూస్, అర గ్లాసు బీట్‌రూట్ జ్యూస్, 10 బాదం పప్పులు, 5 వాల్‌నట్స్, 1 ఏలకులు, 1 లవంగం, పసుపు లేదా 1 చెంచా పసుపు పొడి, అన్నింటినీ కలిపి తాగాలి. పుదీనా తులసి మొక్కల ఆకులు నమలడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి. నెలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చడం మంచి పద్ధతి. టూత్ బ్రష్ పై బ్యాక్టీరియా చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి నెలా టూత్ బ్రష్ మార్చడం వీలు కాకపోతే కనీసం రెండు నెలలకు ఒకసారి బ్రష్‌ని మార్చాలని నిపుణులు వివరించారు.
నోట్.. ఇవి కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఇందులోని అంశాలను పాటించాలనుకుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.