Parenting Tips: పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తున్నారా.. ఆ అలవాటును మాన్పించేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాల్ అవ్వండి..

ఇంటర్నెట్ ప్రపంచంలో పిల్లలు గతంలో కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటు పడ్డారు. ఇది వారి శారీరక శ్రేయస్సును ప్రభావితం చేయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అయితే తల్లిదండ్రులుగా వారికి పిల్లలకు...

Parenting Tips: పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తున్నారా.. ఆ అలవాటును మాన్పించేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాల్ అవ్వండి..
Child Phone Using
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 06, 2022 | 2:47 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో పిల్లలు గతంలో కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటు పడ్డారు. ఇది వారి శారీరక శ్రేయస్సును ప్రభావితం చేయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అయితే తల్లిదండ్రులుగా వారికి పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడం చాలా ముఖ్యం. అంతే కాకుండా వారికి ఆరోగ్య వివరాల పట్ల అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసేలా వారిని ప్రోత్సహించాలి. అలా చేయడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తల్లిదండ్రులు తమ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బయటకు వచ్చి పిల్లలతో గడపాలి. వారికంటూ కొంత సమయం కేటాయించాలి. రాత్రి భోజన సమయం లేదా నిద్రవేళకు ఒక గంట ముందు పిల్లలతో పాటు వారి రోజువారీ షెడ్యూల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది వారిని కొంతకాలం పాటు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచడమే కాకుండా ఆ పరికరాలను ఉపయోగించి వారు ఎంత సమయం గడుపుతున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసేలా చర్యలు తీసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండమని వారిని బలవంతం చేయడానికి బదులుగా, వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి గల కారణాలను వివరించాలి. వారి ఆరోగ్యంపై దాని ప్రతికూల పరిణామాల గురించి తెలుసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల అధిక వినియోగం నుంచి తమను తాము ఆపుకోవచ్చు. విశ్రాంతి సమయాన్ని గడపడానికి ఇంటర్నెట్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపికలలో ఒకటిగా ఉన్నందున ఇతర సరదా కార్యకలాపాల గురించి అవగాహన కల్పించాలి. వారి అభిప్రాయాలను మాట్లాడే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. ఇష్టాలు అయిష్టాల గురించి తెలుసుకోవాలి. పుస్తకాలు చదవడం, పెయింటింగ్, పాటలు పాడటం, ఎలక్ట్రానిక్ పరికరాలపై సమయం గడపడానికి కొన్ని ఉత్తమ ప్రత్యామ్నాయాలు చేయవచ్చు.

వీలైనప్పుడల్లా పిల్లలను బయటకు తీసుకెళ్లాలి. వారు ప్రపంచాన్ని అస్వాదించాలని చెప్పాలి. ఎందుకంటే ఇది వారిని బిజీగా ఉంచగలిగే ఉత్తమమైన ఎంపిక. ఎలక్ట్రానిక్ పరికరాలపై సమయాన్ని వృథా చేయకూడదనుకుంటే, వారు కొంత సమయం ఆరుబయట గడిపేలా చూసుకోవాలి. అయితే నియమాలను అనుసరించమని బలవంతం చేస్తే, అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకు బదులుగా స్క్రీన్ సమయానికి సమయం సెట్ చేయాలి. అందుకు కట్టుబడి ఉంటే రివార్డ్‌లను ఆఫర్ చేయాలి. ఇలా చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!