AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: శరీరానికి సరిపడా నీళ్లు తాగడం లేదా.. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. తస్మాత్ జాగ్రత్త..

మానవ శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన భాగం. శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కిడ్నీలో ఏ సమస్య వచ్చినా అది మొత్తం శరీరం పనితీరుపై...

Kidney Health: శరీరానికి సరిపడా నీళ్లు తాగడం లేదా.. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. తస్మాత్ జాగ్రత్త..
Kidney Disease
Ganesh Mudavath
|

Updated on: Oct 12, 2022 | 7:10 AM

Share

మానవ శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన భాగం. శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కిడ్నీలో ఏ సమస్య వచ్చినా అది మొత్తం శరీరం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ అవయవంలో ఇన్ఫెక్షన్ ఉంటే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. కిడ్నీలో వచ్చే అనారోగ్యాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అయితే చాలా మంది ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు సిచ్యువేషన్ మరింత ఆందోళనకరంగా మారుతుంది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వైభవ్ తివారీ మాట్లాడుతూ.. తరచూ మూత్ర విసర్జన చేయడం, మూత్రం రంగు మారడం కిడ్నీ వ్యాధి లక్షణాలు. దీనితో పాటు పాదాలలో వాపు ఉంటే, అది కిడ్నీ వ్యాధి కూడా కావచ్చు. అంతే కాకుండా ఎప్పుడూ అలసిపోవడం కూడా ఈ వ్యాధి లక్షణం కావచ్చు. అనేక సందర్భాల్లో, కిడ్నీలో తిత్తులు ఏర్పడే సమస్య కూడా ఉంది. అందుకే కిడ్నీ సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

ఇప్పటికే గుండె జబ్బులు లేదా మధుమేహం ఉన్నవారు కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డయాబెటి పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అనేక రకాల బ్యాక్టీరియాలు యాక్టీవ్‌గా మారతాయి. దీని వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాలలో యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీకి కూడా చేరుతుంది. దీని వలన కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం మానుకోవాలి. తాజా పండ్లను తినాలి. రోజంతా శరీరానికి సరిపడా ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.

శరీరంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొన్నిసార్లు వెన్నులో వచ్చే నొప్పి కూడా వ్యాధి కి కారణమవుతుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడంతో పాటు, నడుము కింది భాగంలో నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా కిడ్నీ పనితీరు పరీక్ష చేయించుకోవాలి. 40 కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.