COVID-19: కరోనా బాధితులు..ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా…!

COVID-19: మారుతున్న జీవన శైలిలో మనిషి అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. అయితే చాలా రోగాలను వ్యాయామంతో నివారించవచ్చునని..

COVID-19: కరోనా బాధితులు..ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా...!
Lungs Exercise
Follow us
Surya Kala

|

Updated on: Jun 01, 2021 | 4:13 PM

COVID-19: మారుతున్న జీవన శైలిలో మనిషి అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. అయితే చాలా రోగాలను వ్యాయామంతో నివారించవచ్చునని మన పెద్దలు చెబుతుంటారు. వ్యాయామం శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుచుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన బాధితులు ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని ఈ వైరస్‌ తాకిడి నుంచి ఊపిరితిత్తులను రక్షించుకోవాలంటే… వాటిని శుద్ధి చేయడంతో పాటు శ్వాస తీసుకొనే సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు, పద్ధతులను అనుసరించాలి.

ఇక కోవిడ్ బారిన పడిన వారు మందుతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ క్రమంగా వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. ఊపరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రాణాయామ వంటి బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల నిండా శ్వాస పీల్చుకుని, వదిలే వ్యాయామాలు ప్రతి రోజూ ఉదయాన్నే సాధన చేయాలి. భస్త్రిక, కపాలభాతి, అనులోమ, విలోమ అనే శ్వాస సంబంధిత వ్యాయామాల సాధన వల్ల కూడా ఊపిరితిత్తులను బలపరుచుకోవచ్చు. దీని వల్ల ఆక్సిజన్ సప్లై మెరుగు అవుతుంది. వ్యాయామం వల్ల లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దీని వల్ల నిస్సత్తువ తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలుగుతాయి.

ఊపిరితిత్తుల సామర్ధ్యం సమతులంగా ఉంచడం కోసం స్పైరోమీటర్‌ పరికరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పరికరంలోకి గాలి ఊదడం, పీల్చడంతో ఊపిరితిత్తులు సమర్థంగా పని చేస్తాయి. ఈ పరికరంతో రోజుకు రెండు సార్లు పది నిమిషాల పాటు సాధన చేయడం మంచిది. ఇది అందుబాటులో లేనివారు బెలూన్స్ ను ఊడడం ద్వారా కూడా లంగ్స్ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

లంగ్స్ ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూనే మంచి పోషకాలున్న ఆహారం కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. తినే ఆహారంలో యాంటిఆక్సిడెంట్స్, ఫొరాట్, ప్రొటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. కరోనా ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి సమకూరడం కోసం ఇ, డి, సి, ఎ, బి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఊపిరి తిత్తుల సామర్థ్యాన్ని పెంచే మందులు తీసుకుంటూనే లంగ్స్ బలంగా ఉంచే శారీరక వ్యాయామాలు ప్రతి రోజూ సాధన చేయాలి. ఇందుకోసం గుండె వేగాన్ని పెంచి, శ్వాస ఎక్కువ సార్లు తీసుకునే అవకాశం ఉన్న రన్నింగ్‌, వేగంగా నడవడం, సైకిల్‌ తొక్కడం, స్కిప్పింగ్‌… మొదలైన వ్యాయామాలు చేయాలి.

Also Read: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. పిల్లల్లో వచ్చే కరోనాకు ఫ్లూ వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చు నంటున్న డాక్టర్లు