Sleep Tips: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. మంచి నిద్ర కోసం ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Sleep Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. అయితే చాలామంది తమకు నిద్ర పట్టడంలేదని.. వాపోతుంటారు..

Sleep Tips: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. మంచి నిద్ర కోసం ఈ సింపుల్ చిట్కాలు మీకోసం
Happy Sleep
Follow us
Surya Kala

|

Updated on: Jun 01, 2021 | 5:27 PM

Sleep Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. అయితే చాలామంది తమకు నిద్ర పట్టడంలేదని.. వాపోతుంటారు. కొంతమంది నిద్ర లేమితో అనారోగ్యానికి గురవుతుంటారు కూడా.. అయితే మంచి నిద్ర పట్టాలంటే.. తమ దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. అంతేకాదు.. నిద్ర పట్టకుండా చేసే అంశాల గురించి ఆలోచించాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక కుటుంబ బాధ్యతలు, అనారోగ్యాలు, ఊహించని సంఘటనలు కొన్నిసార్లు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. అందుకని మంచి నిద్ర పట్టాలంటే మన దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని చిట్కాలను పాటిస్తే.. హాయిగా నిద్ర పడుతుంది.

ముఖ్యంగా నిద్రకూ ఓ షెడ్యూల్‌ ఉండాలి. నిద్ర సమయం ఎనిమిది గంటలు అని సాధారణముగా అందరూ భావిస్తారు. అయితే మంచి కలత లేని నిద్ర ఏడు గంటలైనా సరిపోతుంది. నిజానికి వైద్యులు సిఫారసు చేసిన సమయం ఏడు గంటలే. ఎనిమిది గంటలు అవసరం లేదు. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవాలి.. ఒకే సమయంలో లేవాలి.

అయితే సర్వసాధారణంగా ఉద్యోగులు తమకు సెలవు వచ్చిన రోజున కంటే ఓ గంట ఆలస్యంగా పడుకోవడం, లేవడం చేయొచ్చు. మీకు సుమారు 20 నిమిషాల్లో నిద్రపట్టకపోతే… మంచి నిద్రకోసం మనసుకు హాయినిచ్చే మ్చూజిక్ వినండి లేదా ఓ మంచి పుస్తకం చదవండి. నిద్ర వచ్చినప్పుడు వెళ్లి పడుకోండి.. ఇక తినే ఆహార పదార్ధాలతో పాటు.. త్రాగే వాటిపైన శ్రద్ధ వహించాలి ఆహారం త్వరగా తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే తేలిక పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేసే సుఖ నిద్ర తో పాటు.. మంచి ఆరోగ్యం కూడా మీ సొతం అవుతుంది.

Also Read: కరోనా బాధితులు ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా…!

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే