ఒకటికి 100 సార్లు ఆలోచించండి గురూ.. ఎనర్జీ కోసం తాగితే అసలుకే ఎసరొస్తుంది.. ప్రాణాలు పోతాయట..

శరీర శక్తిని పెంచడానికి ప్రజలు తరచుగా ఎనర్జీ డ్రింక్స్‌ను తాగుతుంటారు.. అయితే, ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. ఈ పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ ఉంటాయి. దీంతో ఆకస్మిక గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని, దీనికి తక్షణ చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.

ఒకటికి 100 సార్లు ఆలోచించండి గురూ.. ఎనర్జీ కోసం తాగితే అసలుకే ఎసరొస్తుంది.. ప్రాణాలు పోతాయట..
Energy Drinks Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 08, 2024 | 9:44 AM

శరీర శక్తిని పెంచడానికి ప్రజలు తరచుగా ఎనర్జీ డ్రింక్స్‌ను తాగుతుంటారు.. అయితే, ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. ఈ పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ ఉంటాయి. దీంతో ఆకస్మిక గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని, దీనికి తక్షణ చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.

వాస్తవానికి ఒక కప్పు కాఫీలో 100mg కెఫిన్ ఉంటే, 80mg నుంచి 300mg కెఫిన్ శక్తి ఎనర్జీ డ్రింక్స్‌ లో లభిస్తుంది. అవి టౌరిన్, గ్వారానా వంటి మూలకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి హృదయ స్పందన రేటు, రక్తపోటు, గుండె ఇతర విధులను ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

144 మంది రోగుల నుండి సేకరించిన డేటా ప్రకారం..

అమెరికన్ మాయో క్లినిక్ పరిశోధకులు గుండెపోటు తర్వాత బయటపడిన 144 మంది రోగుల డేటాను అధ్యయనం చేశారు. వీరిలో 7 మంది (20 నుండి 42 సంవత్సరాల వయస్సు) సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు ఎనర్జీ డ్రింక్ తాగారు. వీరిలో ఆరుగురికి కరెంట్ షాక్‌తో చికిత్స అందించగా ఒకరికి సీపీఆర్‌ అవసరం అయినట్లు అధ్యయనం తెలిపింది.

ఇటలీలోని మిలన్‌లోని సెంటర్ ఫర్ కార్డియాక్ అరిథ్మియాస్ ఆఫ్ జెనెటిక్ ఆరిజిన్ అండ్ లాబొరేటరీ ఆఫ్ కార్డియోవాస్కులర్ జెనెటిక్స్‌కు చెందిన నిపుణుల ప్రకటన ప్రకారం.. ఇది కేవలం యాదృచ్చికం అని కొందరు చెప్పవచ్చని తమ నివేదికలో వివరించారు. ‘‘తీవ్రమైన గుండె జబ్బులకు ఎనర్జీ డ్రింక్స్ కారణమని ఇంకా స్పష్టంగా నిరూపించబడలేదని మాకు.. మాయో క్లినిక్‌కి తెలుసు.. అయితే తదుపరి పరిశోధన అవసరం’’ అని వివరించారు.

ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫిన్ – చక్కెర శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

కెఫీన్ హృదయ స్పందన రేటును పెంచుతుందని, మెదడుకు పదును పెట్టి నిద్రను దూరం చేస్తుందని లండన్‌లోని ఫ్లీట్ స్ట్రీట్ క్లినిక్‌కి చెందిన డాక్టర్ బెలిండా గ్రిఫిత్స్ చెప్పారు. తక్కువ మొత్తంలో కెఫిన్ పెద్దలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ (కెఫీన్ కంటెంట్ ఆధారంగా) గుండె జబ్బులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

కానీ, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే రిఫైన్డ్ షుగర్ అస్సలు ఆరోగ్యకరమైనది కాదు. మనం దీనిని నివారించాలని గ్రిఫిత్స్ చెప్పారు. ఆహారం, పానీయాల నుండి మనకు తగినంత చక్కెర లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది.. కొంతసేపటి వరకు శక్తిని అందిస్తుంది.. ఆకస్మికంగా పడిపోతుంది.. అంతేకాకుండా.. ఇది మానసిక స్థితిని పాడు చేయడంతోపాటు.. ఆకలిని పెంచుతుంది.

లండన్‌కు చెందిన పోషకాహార నిపుణుడు బీనీ రాబిన్సన్ ఎనర్జీ డ్రింక్స్ మానేసి, బదులుగా ఫిజీ వాటర్ తాగమని సలహా ఇస్తున్నారు. ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ పై ఆధారపడకూడదని అంటున్నారు. ‘‘ఫిల్టర్ చేసిన నీటిని తాగమని నేను ప్రజలకు సలహా ఇస్తున్నాను – ఇది వాస్తవానికి మనకు శక్తిని ఇస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, స్వీటెనర్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి.. ఇవి మన శక్తి, ప్రేగులపై ప్రభావం చూపుతాయి.’’ అని వివరించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..