AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలహీనత, అలసటతో బాధపడుతున్నారా..? అస్సలు లైట్ తీసుకోవద్దు.. ఆ లోపం ఉన్నట్లే..

అనేక రకాల పోషకాలు, విటమిన్లు మన శరీరానికి అవసరం.. వాటిలో ఒకటి విటమిన్ డి.. విటమిన్ డి లోపం ఎముకలను బలహీనపరుస్తుంది.. ఇంకా కండరాలు నొప్పి, బలహీనత వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇంకా అలసట.. నీరసం లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి.. ఏ పని చేయాలన్నా.. ఆసక్తి ఏర్పడదు.. అందుకే.. ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే..

బలహీనత, అలసటతో బాధపడుతున్నారా..? అస్సలు లైట్ తీసుకోవద్దు.. ఆ లోపం ఉన్నట్లే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్-బి12 శరీరానికి చాలా అవసరమైన మూలకం. దీని లోపం శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపిస్తే.. తక్కువ మొత్తంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. దీంతో చర్మం రంగు పాలిపోవడం ప్రారంభమవుతుంది. దీనికితోడు అలసట, మైకం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2024 | 9:13 AM

Share

అనేక రకాల పోషకాలు, విటమిన్లు మన శరీరానికి అవసరం.. వాటిలో ఒకటి విటమిన్ డి.. విటమిన్ డి లోపం ఎముకలను బలహీనపరుస్తుంది.. ఇంకా కండరాలు నొప్పి, బలహీనత వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇంకా అలసట.. నీరసం లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి.. ఏ పని చేయాలన్నా.. ఆసక్తి ఏర్పడదు.. అందుకే.. ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి విటమిన్ డి స్థాయిని తనిఖీ చేసుకోవాలి.. ఈ లోపాన్ని అధిగమించడానికి చాలా రోజులు పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి..

ఒకవేళ.. విటమిన్ డి లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే.. ఈ లోపాన్ని అధిగమించడానికి, శరీరాన్ని మళ్లీ ఆరోగ్యంగా మార్చడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి..

అయితే.. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. అవేంటో తెలుసుకోండి..

విటమిన్ డీ లోపం తీవ్రత : విటమిన్ డి లోపం ఎంత తీవ్రంగా ఉంటే, దాన్ని అధిగమించడానికి, చికిత్స పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.

చికిత్స రకం : విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి, వైద్యులు సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. సప్లిమెంట్స్ తీసుకునే మొత్తం.. వ్యవధి లోపం, తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు.

ఆరోగ్యం కూడా ముఖ్యమే : మీ మొత్తం ఆరోగ్యం బాగుంటే.. మీకు ఎలాంటి తీవ్రమైన వ్యాధులు లేకుంటే, విటమిన్ డి స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

విటమిన్ డిని గ్రహించే సామర్థ్యం: కొంతమందికి విటమిన్ డిని గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా విటమిన్ డి స్థాయిని పెంచడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

కొన్ని అధ్యయనాల ప్రకారం.. తేలికపాటి విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి 8 నుంచి 12 వారాలు (56-96 రోజులు) పట్టవచ్చు. అదే సమయంలో, తీవ్రమైన లోపాలను తొలగించడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది.. విటమిన్ డి స్థాయిలను తనిఖీ చేయడానికి వైద్యులు రక్తాన్ని పరీక్షించవచ్చు. మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే, వైద్యుడిని సంప్రదించండి. వారు మీకు తగిన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తారు.

విటమిన్ డి స్థాయిలను పెంచడానికి సహజ మార్గాలు

  • ఉదయం సూర్యకాంతి విటమిన్ డి సహజ మూలం. డాక్టర్ సలహా ప్రకారం.. కొద్దిసేపు నేరుగా సూర్యకాంతిలో కూర్చోండి.
  • విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. కొవ్వు చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు మొదలైన కొన్ని ఆహారాలలో విటమిన్ డి కనిపిస్తుంది.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల విటమిన్ డి స్థాయిలను పెంచుకోవచ్చు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..