AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జిమ్ కి వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

బరువు తగ్గాలని అనుకునే చాలా మంది పొద్దున్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు. అయితే ఇది శరీరానికి మంచిదా..? లేక దుష్ప్రభావాలు కలిగిస్తుందా..? అనే విషయంలో చాలా మంది స్పష్టత లేకుండా ఉండచ్చు. ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జిమ్ కి వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
Morning Workout
Prashanthi V
|

Updated on: Feb 08, 2025 | 5:15 PM

Share

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.  ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • శరీర బలహీనత.. పొద్దున్నే శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల అవి మరింత తగ్గిపోతాయి. ఫలితంగా శరీరానికి తగిన శక్తి అందకుండా బలహీనత కలుగుతుంది.
  • తలనొప్పి, వికారం.. శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతే తలనొప్పి, వికారం, గుండెల్లో అసహనంగా అనిపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
  • కండరాల బలహీనత..  ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే శరీరంలో ప్రోటీన్ వినియోగం పెరుగుతుంది. దీని ప్రభావంగా కండరాల బలహీనత ఏర్పడి, శరీర ఆకృతి తగ్గిపోవచ్చు.
  • మెటబాలిజం తగ్గిపోవచ్చు.. సరైన ఆహారం లేకుండా వ్యాయామం చేస్తే శరీరం తక్కువ శక్తిని ఉపయోగించుకునే విధంగా మారుతుంది. దీని వలన కొవ్వు కరిగే స్థాయి తగ్గిపోవచ్చు.
  • శరీర నీరసం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరానికి తగిన శక్తి అందదు. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి.

శరీరానికి తగిన శక్తిని అందించేందుకు వ్యాయామం చేసేముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. వ్యాయామానికి ముందు ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్

ఆపిల్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. దీని వల్ల ఆకలిగా అనిపించదు. ఆపిల్ తినడం వల్ల శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

అరటిపండు

అరటిపండులో సహజంగా ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. అలసట, బలహీనత, కండరాల నష్టం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాతే వ్యాయామం చేయడం ఉత్తమం. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే సరైన ఆహారాన్ని తీసుకుంటూ సమతులిత వ్యాయామాన్ని కొనసాగించడం మంచిది.

కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. అమ్మాయి ఎవరో తెలుసా?
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. అమ్మాయి ఎవరో తెలుసా?
మోటరోలా ఎడ్జ్‌ 70.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
మోటరోలా ఎడ్జ్‌ 70.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
రేపట్నుంచే క్రిస్మస్‌ సెలవులు.. అక్కడ స్కూళ్లకు 20 రోజులు హాలిడ
రేపట్నుంచే క్రిస్మస్‌ సెలవులు.. అక్కడ స్కూళ్లకు 20 రోజులు హాలిడ
అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజీ..!
అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజీ..!
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!