AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Empty Stomach: పొద్దున్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! ఎందుకంటే

రోజులో మొదటి ఆహారం ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఎందుకంటే ఇది రోజంతటికి కావల్సిన శక్తితోపాటు దీర్ఘకాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు అంటున్నారు.సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది చాలా డేంజరట..

Empty Stomach: పొద్దున్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! ఎందుకంటే
Avoid These Foods On An Empty Stomach
Srilakshmi C
|

Updated on: Feb 08, 2025 | 6:05 PM

Share

ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇవి శరీరానికి తీవ్రహాని కలిగిస్తాయి. సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా సాధారణం. కానీ వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ, కాఫీలలో టానిన్లు, కెఫిన్ వంటి పదార్థాలు ఉంటాయి. అవి కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది వాపు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. కొంతమందికి ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది టీ లేదా కాఫీ తాగే వారికే కాదు, కొంతమంది ఉదయం నిద్రలేవగానే స్వీట్లు వంటి నూనెతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారాలు తినకూడదో? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

పరగడుపున స్వీట్లు తింటే ఏమవుతుంది?

సాధారణంగా చాక్లెట్, తీపి స్నాక్స్ ఖాళీ కడుపుతో తినకూడదు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఈ రకమైన పదార్థాల వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అకస్మాత్తుగా పెరుగుదలకు కారణమవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. అంతేకాకుండా, ఖాళీ కడుపుతో చక్కెర తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఏది?

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఖాళీ కడుపుతో పెరుగు తినకూడదు. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కడుపులో మంటను కూడా కలిగిస్తుంది. భోజనం తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు పెరుగు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు

సాధారణంగా, ఖాళీ కడుపుతో ట్యాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇవి కడుపులోని ఆమ్లంతో కలిసిపోయి కడుపు పొరను దెబ్బతీస్తాయి. దీనివల్ల అల్సర్లు, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. డాక్టర్ సూచించినట్లయితే కొన్ని ప్రత్యేక ట్యాబ్లెట్స్‌ మాత్రమే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. కానీ సాధారణంగా ఆహారం తిన్న తర్వాతే ట్యాబ్లెట్స్ తీసుకోవడం మంచిది.

ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినకూడదు

అరటిపండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే, రక్తంలో మెగ్నీషియం స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని వల్ల గుండె దెబ్బతింటుంది. ఉదయం కాకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా సాయంత్రం వేళ అరటిపండ్లు తినడం మంచిది.

ఖాళీ కడుపుతో టమోటాలు తినడం మంచిది కాదు

టమోటాలను ఖాళీ కడుపుతో తినకూడదు. వాటిలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులో స్రవించే ఆమ్లంతో కలిసిపోయి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, వంటల్లో వీటిని ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది.

ఖాళీ కడుపుతో కారంగా ఉండే ఆహారం తినొద్దు

ఖాళీ కడుపుతో కారంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కడుపులో మంట, అల్సర్లు వస్తాయి. కారంగా ఉండే ఆహారాలలో ఉండే క్యాప్సైసిన్ కడుపు పొరను చికాకుపెడుతుంది. దీనివల్ల కడుపులో నొప్పి, మంట వస్తుంది.

శీతల పానీయాలు తాగొద్దు

ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. సాఫ్ట్ డ్రింక్స్ లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కడుపులో ఉబ్బరం, నొప్పి వస్తుంది.

ఈ కారణాలన్నింటి దృష్ట్యా ఉదయం వేళ ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కాబట్టి ఇడ్లీ, దోస, పొంగల్ వంటి తేలిక పాటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.