Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుందా..? ఈ మూడు రసాలతో చెక్ పెట్టవచ్చు..

Kidney Stones Diet: ప్రస్తుత కాలంలో రోజురోజుకూ కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం తీసుకునే ఆహారం, పలు కారణాల వల్ల మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుందా..? ఈ మూడు రసాలతో చెక్ పెట్టవచ్చు..
Kidney Stones
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2022 | 11:56 AM

Kidney Stones Diet: ప్రస్తుత కాలంలో రోజురోజుకూ కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం తీసుకునే ఆహారం, పలు కారణాల వల్ల మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యల్లో కిడ్నీల్లో రాళ్ల సమస్య ఒకటి. ఒక వ్యక్తి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. బాధితుడు చాలా బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారు మంచి డైట్ ప్లాన్‌ను అనుసరించడం మంచిదని.. దీంతో సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. కొన్ని రసాల సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాంటి రసాలు (జ్యూస్‌లు) కిడ్నీల్లో రాళ్ల సమస్యను దూరం చేస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలి..? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్లను దూరం చేసే రసాలు/జ్యూస్‌లు

మీరు కిడ్నీల్లో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే.. ఈ 3 రకాల రసాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో నొప్పితో సహా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

టమాటా రసం..

కిడ్నీల్లో రాళ్లను తొలగించడంలో టమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. రెండు టమోటాలు శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా చేయాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, ఎండుమిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఎక్కువగా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత జ్యూస్ రూపంలో తాగవచ్చు.

నిమ్మరసం..

నిమ్మకాయలో ఎక్కువ మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కిడ్నీ స్టోన్‌ సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మరసం తీసుకుంటే.. ఈ సమస్యను అధిగమించవచ్చు. పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక చెంచా నిమ్మరసం వేసి.. రుచికి తగినట్లుగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి రసం..

కిడ్నీల్లో రాళ్ల సమస్యను దూరం చేయడంలో తులసితో చేసిన రసం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని తులసి ఆకుల రసాన్ని తీసి, దానికి ఒక చెంచా తేనె కలిపి తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

Ginger for Hair: డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా..? అల్లంతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే..?

Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!