Diabetes Reduce Tips: షుగర్ లెవల్స్ రోజరోజుకూ పెరిగిపోతున్నాయా.. ఇలాచేస్తే కంట్రోల్‌ అవ్వడం ఖాయం!

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ వ్యాధి రోజురోజుకూ ముదిరి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. డయాబెటీస్‌కు..

Diabetes Reduce Tips: షుగర్ లెవల్స్ రోజరోజుకూ పెరిగిపోతున్నాయా.. ఇలాచేస్తే కంట్రోల్‌ అవ్వడం ఖాయం!
Diabetes Control Tips
Follow us
Chinni Enni

|

Updated on: May 13, 2024 | 1:16 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ వ్యాధి రోజురోజుకూ ముదిరి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. డయాబెటీస్‌కు ఇంకా సరైన మెడిసిన్ రాలేదు. కేవలం కొన్ని రకాల జాగ్రత్తలతో మాత్రమే నియంత్రణ చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. మధుమేహాన్ని కంట్రోల్ చేసే ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగు అనేది ఎంతో ఆరోగ్యకరమైనది. సరిగ్గా వాడుకుంటే పెరుగుతో ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. పెరుగులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. మరి ఇంత ఆరోగ్యకరమైన పెరుగుతో డయాబెటీస్‌ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో షుగర్ కంట్రోల్..

ప్రతిరోజూ పెరుగును తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్ చేయవచ్చు. పెరుగు శరీరానికి రక్షణ కవచంలా పని చేస్తుంది. చాలా మంది పెరుగును అన్నంతో కలిపి తింటారు. అలా కాకుండా.. డయాబెటీస్‌తో ఉన్నవారైనా, లేనివారైనా.. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును తినడం వల్ల డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారు. ఉన్నవారు కూడా నెల రోజుల్లో తగ్గించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ఇటీవల చేసిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం బయట పడింది. కాబట్టి మీరు కూడా షుగర్ వ్యాధితో బాధ పడేవారు అయితే పైన చెప్పిన విధంగా ఫాలో అయి.. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోండి. పెరుగు తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

పెరుగుతో ఇతర బెనిఫిట్స్:

1. పెరుగును తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు, ముడతలు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జుట్టు కూడా బలంగా, దృఢంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. నిత్యం పెరుగును తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

3. పెరుగును తీసుకోవడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు దూరం అవుతాయి. దీంతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

4. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. పెరుగులో ఫైబర్ కారణంగా.. కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

5. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పెరుగు తింటే తక్షణమే శక్తి అంది.. అలసట, నీరసం దూరం అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.