AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆవుకి అదిరిపోయే లెవెల్లో సీమంతం.. చుట్టాలను పిలిచి కన్నా కూతురిలా.. 

మనం సీమంతం మహిళలకు చేస్తుండటం చూసి ఉంటాం.. కానీ మీరు ఎప్పుడైనా శ్రీమంతం ఆవుకు చేయడం ఎప్పుడైనా చూసి ఉంటారా? ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఆర్ఎంపీ వైద్యులు ప్రసాద్, మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ మధ్యనే ఒక ఆవును కొనుగోలు చేశారు. దీంతో అప్పటినుండి వారి ఇబ్బందులు తొలగిపోయాయని చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

Telangana: ఆవుకి అదిరిపోయే లెవెల్లో సీమంతం.. చుట్టాలను పిలిచి కన్నా కూతురిలా.. 
Cow Seemantham
P Shivteja
| Edited By: |

Updated on: Dec 26, 2024 | 4:02 PM

Share

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గురువారం గోమాతకు సీమంతం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యులు ప్రసాద్, మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ మధ్యనే ఒక ఆవును కొనుగోలు చేశారు. దీంతో అప్పటినుండి వారు ఇబ్బందులు తొలగిపోయాయని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆవు ఐదు నెలల గర్భవతి కావడంతో, మనుషుల మాదిరిగానే ఆవును కూడా చూసుకోవాలనే సంకల్పంతో ఆవుకు సీమంతం నిర్వహించారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రసాద్, మాధవి దంపతులు గర్భవతి అయిన ఆవుకు పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. గోమాతలను రక్షించి భూమిని కాపాడుకోవాలని సంకల్పంతో ఆవుల రక్షణ కోసం కృషి చేస్తున్నామని మాధవి, ప్రసాద్ దంపతులు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో గోవును హిందువులు దైవంగా భావిస్తారు. కొందరు తమ ఇంటి బిడ్డలు గానూ భావిస్తారు. అలానే వీళ్ళు కూడ గోమాతను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఇలా శ్రీమంతం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!