బ్రదరూ చీప్‌గా చూడకండి.. ఇవి ఆరోగ్యానికి వరం లాంటివి.. ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..
ప్రస్తుత కాలంలో చాలామంది రక్తపోటు (బ్లడ్ ప్రెజర్, హై బ్లడ్ ప్రెజర్) సమస్యతో బాధపడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలతోపాటు.. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధికపోటు.. వాస్తవానికి అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది రక్తపోటు (బ్లడ్ ప్రెజర్, హై బ్లడ్ ప్రెజర్) సమస్యతో బాధపడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలతోపాటు.. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధికపోటు.. వాస్తవానికి అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. కానీ పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటుతో పోరాడవచ్చు. టొమాటోల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీ స్థాయిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వాస్తవానికి టొమాటో.. ప్రతి ఒక్కరి వంటగదిలో లభించే సాధారణ వెజిటేబుల్..ఇది ఎరుపు రంగు, పసుపు రంగులో ఉంటుంది. టొమాటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. టొమాటోలో విటమిన్లు, పోషకాలు, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా టమోటాలు వరం లాంటివని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా టమాటా.. ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని రక్షించడమే కాకుండా చర్మానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
క్యాన్సర్‌ను నివారిస్తుంది..
మనం ఆహారంలో టమోటాలు చేర్చుకోవడం వల్ల.. ఆహారం రుచిగా ఉండటమే కాకుండా క్యాన్సర్‌తో పోరాడుతాయి. టమాటాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని లైకోపీన్‌లో యాంటీ క్యాప్సినోజెనిక్ గుణాలు ఉన్నాయి. ఇది కడుపు, కాలేయ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..
టొమాటోలో ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉంటాయి. ఫైబర్, కోలిన్, విటమిన్ సి, పొటాషియం కారణంగా గుండెకు మంచిది. లైకోపీన్ మన శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇంకా బీపీని నియంత్రిస్తుంది.
చర్మ ఆరోగ్యం కోసం..
చర్మ ఆరోగ్యం కోసం టొమాటోలను ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది. ముఖంపై మొటిమలను తొలగిస్తుంది. ముఖ రంధ్రాలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..