బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం పూర్తిగా మానేయాలా..? ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి..

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. బరువు తగ్గే ప్రయాణంలో కఠినమైన డైట్ ను అనుసరిస్తున్నారు. పలు ఆహార పదార్థాలను తినడం ఆపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బరువు తగ్గడానికి సంబంధించిన అనేక అపోహలను సులభంగా నమ్ముతున్నారు.. అలాంటి వాటిలో ఒకటి అన్నానికి సంబంధించినది.

బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం పూర్తిగా మానేయాలా..? ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి..
Weight Loss
Follow us

|

Updated on: Jun 09, 2024 | 5:22 PM

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. బరువు తగ్గే ప్రయాణంలో కఠినమైన డైట్ ను అనుసరిస్తున్నారు. పలు ఆహార పదార్థాలను తినడం ఆపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బరువు తగ్గడానికి సంబంధించిన అనేక అపోహలను సులభంగా నమ్ముతున్నారు.. అలాంటి వాటిలో ఒకటి అన్నానికి సంబంధించినది. అన్నం తింటే బరువు పెరుగుతారని తరచుగా వింటుంటాం. పొట్ట, నడుము కొవ్వు తగ్గించుకోవాలనుకునే వారు రోజువారీ ఆహారం నుంచి అన్నాన్ని పూర్తిగా మినహాయించటానికి కారణం ఇదే. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని ఫిట్‌నెస్ కోచ్ లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఫిట్‌నెస్ కోచ్ సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కీలక విషయాలను వెల్లడించారు. బరువు తగ్గడానికి సంబంధించిన ఈ అపోహను బద్దలు కొట్టడానికి.. దానిని సులభంగా, ఆసక్తికరంగా వివరించడానికి, ఫిట్‌నెస్ కోచ్ వీడియోలో అన్నం ( బియ్యం) పాత్ర గురించి వివరించారు. అంతేకాకుండా పోషకాహారానికి సంబంధించిన వాస్తవాలను పంచుకున్నారు.

బరువు తగ్గించే ప్రయాణంలో అన్నం తినడం మంచిదేనా?..

ఫిట్‌నెస్ కోచ్ క్యాప్షన్‌లో ఇలా రాశారు.. ” బరువు, కొవ్వు తగ్గే ప్రయాణంలో నేను అన్నం తినవచ్చా? ఇది సర్వసాధారణంగా అడిగే ప్రశ్న. అవును, మీరు అన్నం తినవచ్చు.. అన్నం ఊబకాయానికి దారితీయదు. ఎక్కువగా అన్నం తినకూడదు.. ఇంకా మీ ఆహార ఎంపిక గురించి తెలివిగా ఉండాలి.’’ అంటూ పేర్కొన్నారు.

బియ్యం – బరువు మధ్య సంబంధం ఏమిటి?

బియ్యం నేరుగా బరువు పెరుగుటతో సంబంధం కలిగి ఉండదు.. అయినప్పటికీ, బియ్యం లేదా ఇతర సారూప్య ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇంకా క్యాప్షన్‌లో, ఫిట్‌నెస్ కోచ్ ఎలాంటి అపరాధభావం లేదా చింత లేకుండా అన్నాన్ని తినడానికి ముందుగా “లంచ్/డిన్నర్‌కి కూర్చోవడానికి 10-12 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు లేదా మజ్జిగ తాగండి. తర్వాత సలాడ్ తినండి, ఆపై పప్పులు తినండి. బియ్యంతో పరిమాణ నియంత్రణను అనుసరించండి.. ఎక్కువ పప్పులు.. పెరుగు తినండి.” అని వివరించారు.

బరువు తగ్గే చిట్కాలు..

నిదానంగా తినడం.. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినాలి..

తినే సమయంలో టీవీ లేదా ఫోన్ చూడటం మానుకోవాలి.. ఇది మీరు అతిగా తినకుండా నిరోధిస్తుంది.

అన్నం తినడం వల్ల మధుమేహం రాదు.. కానీ ఎక్కువ తినడం వల్ల అది జరుగుతుంది.

శారీరకంగా బలంగా ఉండటానికి ప్రయత్నించండి.. చురుకుగా ఉండటంపై దృష్టి పెట్టండి.. మీ శరీరాన్ని తరచూ కదిలించండి..

జీవనశైలిని మెరుగుపరుచుకోండి.. సమతుల్య ఆహారం తీసుకోండి..

ఇంటర్నెట్‌లో మీరు చూసే ప్రతిదానికీ భయపడటం మానేయండి.

తగినంత నిద్రపోవాలి..

ప్రతిరోజూ నడక, వ్యాయామం, ధ్యానం లాంటివి అలవర్చుకోవాలి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.