Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon water: నిమ్మకాయ నీళ్లు రోజూ తాగితే.. ప్రమాదమా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఒక లీటరు నీటిలో నాలుగు నిమ్మకాయలు కలుపుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండుకుని అందులో తేనె, పుదీనా ఆకులు, అల్లం కలుపుకుని తాగితే చాలా మంచిది. రోజూ సరైన మోతాదులో లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. కానీ, ..

Lemon water: నిమ్మకాయ నీళ్లు రోజూ తాగితే.. ప్రమాదమా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Lemon Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 30, 2023 | 6:09 PM

ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. వేడి నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది నిమ్మరసం తాగుతుంటారు. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచడానికి నిమ్మరసం ఉత్తమం. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి బూస్ట్ ఇస్తాయి. కొంతమంది ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. ఇలా రోజూ తాగడం వల్ల టాక్సిన్స్‌ని తొలగించి శరీరం శుభ్రపడుతుంది. లెమన్ వాటర్ తాగడం చర్మ సంరక్షణకు కూడా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే అమృతం కూడా అతిగా తాగితే విషంగా మారుతుందనే సామెత మేరకు.. లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మరసం నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీన్ని రోజూ ఖాళీ కడుపుతో కొద్దిగా తేనె కలిపి తాగొచ్చు. కానీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల రోజంతా పొట్ట లైనింగ్ చికాకు కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా నెమ్మదిస్తుంది. ఆ తరువాత గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం, అపానవాయువుకు కారణమవుతుంది. నిమ్మకాయలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల అల్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి శరీరం శుభ్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఇది అతి మూత్రవిసర్జనకు దారితీస్తుంది.. దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. మూత్రవిసర్జన సమయంలో నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ శరీరం నుండి విసర్జించబడతాయి. ఇది అప్పుడు డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీంతో అలసట, పొడి పెదవులు, అధిక దాహం కూడా కలిగిస్తుంది.

  • నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల తీవ్రమైన తలనొప్పి , మైగ్రేన్‌లు వస్తాయి.
  • నిమ్మకాయ ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి, నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. ఇది దంతాల ఎనామిల్ కుళ్ళిపోవడానికి కూడా కారణమవుతుంది.
  • నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోతుంది. దీంతో వెంట్రుకల కుదుళ్లు పొడిబారిపోతాయి. జుట్టు విరిగిపోయే అవకాశం కూడా ఉంది.
  • కొందరికి బుగ్గల లోపలి భాగంలో, నాలుక కింద పుండ్లు వస్తాయి. మీరు గమనించారా? నిమ్మరసం ఎక్కువగా తాగితే ఈ పుండ్లు రావడానికి కారణం అదే. నిమ్మరసం ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తాగడం వల్ల విటమిన్ లోపం, అల్సర్లు వస్తాయి. అల్సర్ ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోవడం తగ్గించాలి. లేని పక్షంలో వ్యాధి తీవ్రమవుతుంది.

ఇది చదివిన తర్వాత, నిమ్మరసం తాగడం మీ ఆరోగ్యానికి హానికరం అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడూ. సరైన మోతాదులో తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి మీరు రోజుకు ఎన్ని గ్లాసుల నిమ్మరసం తాగవచ్చు..? అనేది తెలుసుకోవటం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

రోజూ రెండు గ్లాసుల లెమన్ వాటర్ తాగవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక లీటరు నీటిలో నాలుగు నిమ్మకాయలు కలుపుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండుకుని అందులో తేనె, పుదీనా ఆకులు, అల్లం కలుపుకుని తాగితే చాలా మంచిది. రోజూ సరైన మోతాదులో లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..