Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine: మైగ్రేన్ నొప్పితో బాధ పడుతున్నారా..? ఈ పరికరంతో ఇట్టె చెక్ పెట్టొచ్చు తెలుసా..

ప్రపంచ వ్యాప్తంగా మైగ్రేన్ అనేది పెద్ద సమస్యగా మారింది.. మైగ్రేన్ అనేది తలనొప్పి రూపంలో వస్తుంది. మైగ్రేన్ ఉన్నవారి బాధ మాటల్లో వర్ణించలేని. ఎన్ని రకాల మందులు వాడినా మైగ్రేన్ అనే దానికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత దేశానికి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ తయారీ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మైగ్రెన్ నుంచి ఉపశమనం కోసం ఒక పరికరాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

Migraine: మైగ్రేన్ నొప్పితో బాధ పడుతున్నారా..? ఈ పరికరంతో ఇట్టె చెక్ పెట్టొచ్చు తెలుసా..
Migraine
Follow us
Sridhar Prasad

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 28, 2024 | 7:35 PM

ప్రపంచ వ్యాప్తంగా మైగ్రేన్ అనేది పెద్ద సమస్యగా మారింది.. మైగ్రేన్ అనేది తలనొప్పి రూపంలో వస్తుంది. మైగ్రేన్ ఉన్నవారి బాధ మాటల్లో వర్ణించలేని. ఎన్ని రకాల మందులు వాడినా మైగ్రేన్ అనే దానికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత దేశానికి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ తయారీ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మైగ్రెన్ నుంచి ఉపశమనం కోసం ఒక పరికరాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీనికోసం నేరివియా అనే డివైస్ ను విడుదల చేసింది. ఈ పరికరం మైగ్రేన్ డ్రగ్ ఫ్రీ మేనేజ్మెంట్ కోసం పనిచేస్తుంది. దీన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. దీన్ని ఒక థెరపీ పరికరంగా పరిగణించారు.

మైగ్రేన్ అనేది జనాభాలో 1.7 నుండి 4 శాతం వరకు ఉందని ఆరోగ్య నిపుణల అంచనా.. కేవలం మన ఇండియా లో ఉన్న మైగ్రేన్ బాధితుల్లో 60 శాతం మంది మహిళలపై మైగ్రేన్ ప్రభావాన్ని చూపుతుంది.. అయితే నేరివియా అనే పరికరం ప్రిస్కిప్సన్ ఆధారిత ఇన్వాసివ్ డివైస్ ఇది 12 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు ఉపయోగించవచ్చు. మైగ్రేన్ నుంచి ఉపశమనం కోసం .. చికిత్స కోసం దీన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని చేయి పై ధరించవచ్చు..

ఇది తలనొప్పి ప్రారంభం అయిన గంట లోపు ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు..ఈ పరికరంలో రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరో మాడ్యూలైజేషన్ మెకానిజం ను ఉపయోగించి నరాల చివరలను ప్రేరేపించడం ద్వారా కండిషన్డ్ పెయిన్ మాడ్యులేజేషన్ ప్రత్యేకంగా చేస్తుందని కంపెనీ చెప్తోంది. ఇది మెదడు వ్యవస్థలో సహజంగా నొప్పి ఉపశమన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది తలపై మైగ్రేన్ నొప్పి అసలు మూలాన్ని ప్రభావితం చేస్తుంది.. వైద్య పరంగా నేరేవియా పరికరం డ్రగ్ ఫ్రీ అప్షన్స్ ని ఇష్టపడేవారికి చక్కటి అప్షన్ అంటున్నారు వైద్యులు.. దీనివల్ల అడ్డగోలుగా మందుల వినియోగం ఉండదని నిపుణలు చెబుతున్నారు.

Nerivio

Nerivio

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..