Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer: బీరు తాగుతున్నప్పడు ఈ 5 తినకండి, కిడ్నీలో రాళ్లతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం

చల్ల చల్లగా బీర్లు తాగటం హాట్ ట్రెండ్ గా మారింది. సాధారణంగా వేసవికాలంలోలిక్కర్ సేవించడం సహజం.. చిల్ బీర్ తాగుతూ దొరికిందల్లా తినేస్తామంటూ కుదరదంటున్నారు. వేసవిలో, చల్లని బీర్ కోసం కోరిక ప్రజలలో పెరుగుతుంది. అయితే బీర్ తాగే సమయంలో కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పొరపాటున కూడా బీరుతో వీటిని తినకండి.

Beer: బీరు తాగుతున్నప్పడు ఈ 5 తినకండి, కిడ్నీలో రాళ్లతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం
Beer Drawing
Follow us
Sanjay Kasula

|

Updated on: May 15, 2023 | 11:59 AM

వేసవిలో కోల్డ్ బీర్‌కు డిమాండ్ పెరుగుతుంది. బీర్‌ను ఎక్కువగా తాగడానికి ఇష్టపడే వారికి ఈ మండే వేడిలో బీర్‌ను మించిన ఆప్షన్ మరొకటి లేదు. నేటి యంగ్ జనరేషన్ వీకెండ్ పార్టీలు ఎంతో ఆనందంగా బీర్ తాగుతున్నాయి. కానీ మీ సమాచారం కోసం, అది బీర్ అయినా లేదా మరేదైనా ఆల్కహాల్ అయినా ఆరోగ్యానికి హానికరం అని మీరు ముందుగా తెలుసుకోండి. అయితే, తాగే వ్యక్తుల మానసిక ప్రశాంత రావాలంటే చల్లని బీర్ తాగితేనే మనసు శాంతినిస్తుంది. దాని స్వల్ప మత్తు చాలా సరైనదనిపిస్తుంది.  ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అని మీనలో చాలా మందికి తెలుసు. అయితే తాగేస్తుంటాం.

అది బీర్, విస్కీ లేదా ఇతర రకాల మత్తుపదార్థాలు అయినా అవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. కానీ మీ సమాచారం కోసం బీర్‌తో వీటిని తినడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని బీరుతో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు ఓ సారి తెలుసుకుందాం..

ఖర్జూరం

టెండు పండ్లలో టానిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటున కూడా బీరుతో తినకండి.. లేకుంటే కడుపులో రాళ్లు రావచ్చు. ఆల్కహాల్‌తో మాత్రమే కాకుండా, ఏ రకమైన అధిక ప్రోటీన్ ఫుడ్‌తోనైనా బీర్‌కు దూరంగా ఉండాలి, లేకుంటే అది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

బేకన్

బేకన్‌లో నైట్రోసమైన్‌లు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు, ఆల్కహాల్‌లో దాని పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. బీర్, బేకన్ కలయిక గొంతు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి ఇదే కారణం.

టమాటో

టమాటో పుల్లగా ఉంటుంది ఎందుకంటే అందులో టానిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పుల్లని టమాటోలను బీర్ లేదా ఆల్కహాల్‌తో వాడకూడదు. లేకుంటే అది చంచలత్వం, వాంతికి కారణం కావచ్చు.

కారెట్

చాలా మంది బీరుతో సలాడ్ తినడానికి ఇష్టపడతారు. మీరు డ్రింక్ ప్లాన్ చేసినప్పుడు.. బీరుతో సలాడ్ తినకుండా ఉండండి. ఆల్కహాల్, క్యారెట్ కలయిక కాలేయానికి ప్రమాదకరమని తేలింది.

బీన్స్

ఆహారంలో శెనగలు లేదా పప్పులు ఏవైనా ఉంటే.. వాటిని బీరుతో తినడం మానుకోవాలి. వాటిని పొరపాటున కూడా తినకూడదు. బీన్స్‌లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. బీరుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ప్రమాదకరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం