AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ డ్రింకులు ఆబగా తాగుతున్నారా.? విషంతో సమానం.. బీ కేర్‌ఫుల్.!

సమ్మర్ మొదలైంది. భానుడి ప్రతాపంతో మార్చి ఎండింగ్‌లోనే ప్రజలు చుక్కలు చూస్తున్నారు. బయటకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, లెమన్ వాటర్, ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు దర్శనమిస్తున్నాయి. కానీ సమ్మర్‌లో దొరికే డ్రింక్స్ ఏవి పడితే అవి..ఈ స్టోరీ చదివేయండి..

ఈ డ్రింకులు ఆబగా తాగుతున్నారా.? విషంతో సమానం.. బీ కేర్‌ఫుల్.!
Representative Image
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Mar 23, 2024 | 1:27 PM

Share

సమ్మర్ మొదలైంది. భానుడి ప్రతాపంతో మార్చి ఎండింగ్‌లోనే ప్రజలు చుక్కలు చూస్తున్నారు. బయటకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, లెమన్ వాటర్, ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు దర్శనమిస్తున్నాయి. కానీ సమ్మర్‌లో దొరికే డ్రింక్స్ ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు న్యూట్రీషియన్స్. మరి న్యూట్రీషియన్స్ ఈ సమ్మర్‌లో మనకి ఇచ్చే సలహాలు ఏంటో తెలుసుకుందామా?

ఎండాకాలం అంటే ఒకప్పుడు నిమ్మకాయ నీరు తాగేవారు. కానీ ఇప్పుడు మాత్రం అనేక రకాల చల్లటి డ్రింక్స్ మనకి అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఎక్కడపడితే అక్కడ దొరికే ప్యాకేజ్ కూల్‌డ్రింక్స్ తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది సమ్మర్‌లో బయటికి వెళ్లి రాగానే గ్లూకోస్ పౌడర్, ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ తాగేస్తున్నారు. ఎండవేడికి శరీరంలోని నీరు ఆవిరైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు బయటకు వెళ్లి రాగానే ఏదో ఒక డ్రింక్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు చాలామంది ప్యాకేజ్డ్ కూల్‌డ్రింక్స్ తీసుకుంటున్నారు. అది మంచిది కాదని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్యాకేజ్డ్ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బెటర్.. కానీ అందరూ రెగ్యులర్‌గా తీసుకోవడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. గ్లూకోస్ పౌడర్, ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ కూడా వడదెబ్బ నుంచి త్వరగా కోలుకోవడానికి మాత్రమే తీసుకోవాలని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది కాదని అన్నారు.

ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి, రిలాక్స్ కావడానికి ఇంట్లో చేసుకునే డ్రింక్స్ చాలా బెటర్ అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మనం తీసుకునే వాటర్‌లో షుగర్, సాల్ట్, లెమన్ డ్రాప్స్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. బయట నుంచి వచ్చినవాళ్లు రిలాక్స్ కావడానికి యూజ్ అవుతుందని న్యూట్రీషన్స్ అంటున్నారు. ఆరు నెలల చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు ఈ డ్రింక్ అందరికీ ఎండాకాలంలో బాగా ఉపయోగపడుతుందని సలహా ఇస్తున్నారు. వీటితో పాటు ద్రాక్షరసంలో కొంచెం చక్కెర, ఉప్పు, నీరు కలిపి తీసుకున్నా సమ్మర్‌లో చాలా మంచిదని నిపుణుల సలహా. లీటర్ వాటర్‌లో కొంచెం అల్లం, పుదీనా రసం, చక్కెర, ఉప్పు కలిపి తీసుకుంటే కూడా చాలా బెటర్ అని అంటున్నారు. లేదా బయట దొరికే కొబ్బరి నీళ్లు, చెరుకు రసం లాంటివి తీసుకున్నా ఎండాకాలంలో చాలా మంచిదని సలహా ఇస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం