AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Tips: హోలీ ఆడుతున్నారా.. అయితే జాగ్రత్తలు మస్ట్, ఎందుకంటే

పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టపడే హోలీ పండుగ త్వరలో రాబోతోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు ముఖం, శరీరంపై పడితే క్లీన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. మార్కెట్‌లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎఫెక్ట్ చూపుతున్నాయి. హోలీ ఆడేముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

Holi Tips: హోలీ ఆడుతున్నారా.. అయితే జాగ్రత్తలు మస్ట్, ఎందుకంటే
Holi
Balu Jajala
|

Updated on: Mar 23, 2024 | 1:31 PM

Share

పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టపడే హోలీ పండుగ త్వరలో రాబోతోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు ముఖం, శరీరంపై పడితే క్లీన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. మార్కెట్‌లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎఫెక్ట్ చూపుతున్నాయి. హోలీ ఆడేముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడపిల్లలైనా, అబ్బాయిలైనా అందరికీ చర్మ సంరక్షణ అవసరం. హోలీ రోజున అబ్బాయిలు తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హోలీ రోజు అబ్బాయిల ముఖాలు మరింత రంగులమయం అవుతాయి. కాబట్టి హోలీ రోజున చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి

లోషన్‌ను పూయండి : హోలీ ఆడటానికి ఒక రోజు ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేయండి. దీనితో మీ గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. మీరు మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె వంటి ఏదైనా ఒక నూనెతో మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.

ఫుల్ స్లీవ్ దుస్తులు: హోలీ రంగులు మీ ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. మీరు బయట హోలీ ఆడబోతున్నట్లయితే, ఫుల్ స్లీవ్ షర్ట్ ధరించండి. బాగాలేని చెప్పులు, షూ ధరించండి. దీని వల్ల పాదాల చర్మం రంగుల నుండి కూడా రక్షించబడుతుంది.

హోలీ ఆడే ముందు: మీరు మీ చర్మాన్ని రంగు కోల్పోకుండా కాపాడుకోవాలనుకుంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాయండి. కొద్దిసేపటికి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. కనురెప్పలు, మీ కళ్ల చుట్టూ ఉన్న ప్రదేశంలో కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్‌ని అప్లయ్ చేసుకోండి. కళ్లకు అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్లండి.

రంగులు ఉంటే: ముఖం మీద రంగులు ఉంటే అదే పనిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోకూడదు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి. ముఖానికి రంగు పోయిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా నెయ్యి రాసుకోవాలి.