AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఉదయం నిద్ర లేవగానే మీరూ ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే వెంటనే మానుకోండి..

Health: మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్‌గా...

Health: ఉదయం నిద్ర లేవగానే మీరూ ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే వెంటనే మానుకోండి..
Narender Vaitla
|

Updated on: Sep 05, 2021 | 11:39 AM

Share

Health: మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్‌గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. అయితే మనకు తెలిసో.. తెలియకో ఉదయం నిద్రలేవగానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీనివల్ల వాటి ప్రభావం మనపై తీవ్రంగా పడుతుంది. దీంతో మన పని నాణ్యత తగ్గడానికి కారణంగా మారుతుంది. మరి సాధారణంగా ఉదయం నిద్రలేవగానే మనం చేసే తప్పులేంటి.? వాటి వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిద్ర నుంచి మేలుకోగానే దాదాపు అందరూ చేసే పని పక్కన ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ తీసి చెక్‌ చేయడం. కానీ ఇది మంచి అలవాటు కాదు. ముఖ్యంగా ఉదయం లేవగానే చూడకూడని, చదవకూడని ఏదైనా విషయం మన కంటపడిందంటే రోజంతా డిస్ట్రబ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉదయం లేవగానే చీకట్లో కళ్లపై ఫోన్‌ వెలుతురు పడడం కూడా అంత మంచిదికాదు. కాబట్టి ఫోన్‌కు దూరంగా ఉండడమే మంచిది.

* ఉదయం నిద్ర నుంచి లేవగానే చాలా మంది బెడ్‌ మీదే కాఫీ, టీ తాగుతుంటారు. దీనిని ఒక స్టేబస్‌ సింబల్‌గా కూడా చూస్తుంటారు. అయితే రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోని కారణంగా కడుపంతా ఖాళీగా అవుతుంది. ఇలాంటి సమయంలో కాఫీ, టీ తాగితే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది, అసిడిటీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా మంచి నీరును తాగే అలవాటు చేసుకోండి. వీలైతే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతో పాటు శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి.

* ఇక నిద్రలేవగానే గబగబా పనులు మొదలు పెట్టకూడదు. మొదట కాసేపు కాళ్లు, చేతులు కదిస్తూ వామప్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల నిద్ర మత్తు పోవడంతో పాటు శరీరానికి కాస్త శక్తి కూడా వస్తుంది. బెడ్‌ దిగగానే అదరబాదరగా వెళితే మత్తులో తూలి పడే అవకాశం ఉంటుంది.

* ఉదయం లేచిన తర్వాత కచ్చితంగా కనీసం 20 నిమిషాలైనా యోగా, వ్యాయామం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది.

* ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ప్రతీ రోజూ ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆఫీసు సెలవని, ఎలాంటి పని లేదని ఆలస్యంగా లేవకూడదు. పని ఉన్నా లేకున్నా రోజూ ఒకే సమయానికి లేచేలా ప్లాన్‌ చేసుకోవాలి.

Also Read: Ganesh Festival: ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ.. గణేష్ ఫెస్టివల్ ఫైట్.. ఎవరి దారెటు.. ఎవరి వెర్షన్ ఏంటి..?

Viral Video: ఇది మాములు ఎలుగు బంటి కాదు.. కారెక్కెందుకు విన్యాసాలు.. చివరకు.. వీడియో వైరల్..

Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..