Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 05, 2021 | 11:02 AM

Poonam Kaur: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటారు నటి పూనమ్‌ కౌర్‌. సమాజంలో జరుగుతోన్న అంశాలపై తనదైన రీతిలో నటించే ఈ నటి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు...

Poonam Kaur: 'అతను ఒక రాజకీయ నేరగాడు'... సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

Poonam Kaur: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటారు నటి పూనమ్‌ కౌర్‌. సమాజంలో జరుగుతోన్న అంశాలపై తనదైన రీతిలో నటించే ఈ నటి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంటారు. తాజాగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ వ్యవహారంపై కాంట్రవర్సీ ట్వీట్ చేసిన పూనమ్‌ తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. పూనమ్‌ కౌర్‌ ఇటీవల ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ట్వీట్ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పలు స్క్రీన్‌ షాట్స్‌లను పోస్ట్‌ చేసిన పూనమ్‌.. ‘అతను ఓ దళితుడికి గుండు కొట్టించాడు. ఐఏఎస్‌ అధికారుల ఫోన్లను హ్యాక్‌ చేశాడు. వాట్సాప్‌లో అసత్యపు కథనాలు, సందేశాలను ఫార్వర్డ్‌ చేశాడు. అతను రాజకీయ నేరగాడు కూడా అయిండొచ్చు. అతను చేసిన కొన్ని మెసేజ్‌లు, లేటర్స్‌ సేఫ్టీ కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. అంతటితో ఆగని పూనమ్‌ ఈ ట్వీట్‌కు షీటీమ్స్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీసింది.

పూనమ్‌ చేసిన పోస్టు ఆధారంగా ఆమె ప్రస్తావించిన వ్యక్తి బిగ్‌బాస్‌ ఫేమ్‌ నూతన్‌ నాయుడు అని అర్థమవుతోంది. ఓ దళితుడికి నూతన్‌ నాయుడు గుండు కొట్టిచ్చిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరి పూనమ్‌ చేసిన ఈ ట్వీట్‌ ఎలాంటి కాంట్రవర్సీలకు దారి తీస్తుందో చూడాలి.

Also Read: Crime News: నమ్మకంతో నట్టేట ముంచిన మహిళ.. చిట్టీ పేరుతో రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ..

Home Remedies for Platelets: ప్లేట్‌లెట్స్ తగ్గి ఇబ్బందులు పడుతున్నారా.. ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచే సింపుల్ చిట్కాలు మీకోసం

Divi Vadthya: ‘ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు’… కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu