Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divi Vadthya: ‘ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు’… కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.

Divi Vadthya: మహేష్‌ బాబు హీరోగా వచ్చిన 'మహర్షి' సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన నటి దివి వైద్య ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కొన్ని నెలల క్రితం...

Divi Vadthya: 'ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు'... కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2021 | 9:58 AM

Divi Vadthya: మహేష్‌ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన నటి దివి వైద్య ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనంతటికీ కారణం బిగ్‌బాస్‌ రియాలిటీ షో. బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో పాల్గొన్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుందీ చిన్నది. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాకముందే దివికి ఆఫర్లు క్యూకట్టాయి. ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షో తర్వాత దివి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రతీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇప్పటి వరకు దివిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టే దివికి క్రేజ్‌ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందమైన రూపం ఆకట్టుకునే కళ్లతో కుర్రకారు గుండెల్లో దడ పుట్టిస్తోన్న ఈ అందాల తార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసింది.

రెడ్‌ కలర్‌ గౌనులో చేతులో పుస్తకాన్ని పట్టుకొని దిగిన కొన్ని క్యూట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసిన దివి.. ‘నన్ను మల్లె తీగలా నువ్వు అల్లుకుంటే.. నిలువెత్తు ప్రాణం నిలువదండి’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించింది. ఇక ఈ ఫొటో చూసిన ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఓ అభిమాని చేసిన.. ‘ఈ కళ్లు చూస్తూ బతికేయొచ్చు’ అనే కామెంట్‌ అక్షరాల నిజమనింపచక మానదు. మరి దివి పోస్ట్‌ చేసిన ఈ క్యూట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

Divi

Also Read: Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.

chandini chowdary: కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.