Ganesh Festival: ఏపీలో బీజేపీ vs వైసీపీ. గణేష్ ఫెస్టివల్ ఫైట్. ఎవరి దారెటు.. ఎవరి వెర్షన్ ఏంటి.?

మరో ఐదురోజులు.. ! ఆ తర్వాత 9 రోజులు వైభవంగా జరిగే గణపతి నవరాత్రులు. ఇంతకీ ఆ వేడుకలు చెయ్యాలా వద్దా. ! ఏపీని రాజకీయంగా కూడా

Ganesh Festival: ఏపీలో బీజేపీ vs వైసీపీ. గణేష్ ఫెస్టివల్ ఫైట్. ఎవరి దారెటు.. ఎవరి వెర్షన్ ఏంటి.?
Ganesh Festival Fight In Ap
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 05, 2021 | 11:37 AM

APBJP vs YSRCP: మరో ఐదురోజులు.. ! ఆ తర్వాత 9 రోజులు వైభవంగా జరిగే గణపతి నవరాత్రులు. ఇంతకీ ఆ వేడుకలు చెయ్యాలా వద్దా. ! ఏపీని రాజకీయంగా కూడా హీటెక్కిస్తున్న టాపిక్ ఇది. దేశంలో థర్డ్ వేవ్‌ భయాలు ఉన్న నేపథ్యంలో లేకపోతేనే బెటర్ అన్నది అటు ఏపీలో ప్రభుత్వం, ఎందుకు చెయ్యొద్దంటోంది బీజేపీ. ఈ ఫెస్టివల్‌ ఫైట్‌లో ఎవరి దారేంటి.. ఎవరి వెర్షన్ ఏంటన్న లోతుల్లోకి వెళ్తే.. వినాయక చవితి అంటే దేశమంతా ఓ పెద్ద పండగ. లక్షల్లో మంటపాటలు, కోట్ల మంది భక్తుల ఆరాధన. 9 రోజుల తర్వాత ఇక ఆ నిమజ్జనం సందడే వేరు. చెప్పాలంటే దేశమంతా ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంది. కానీ కరోనా విజృంభిస్తున్న వేళ.. రెండేళ్లుగా పండుగా పబ్బం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఈ సారైనా పండుగ జరిగే బాగుండన్నది అందరి ఆలోచన. కానీ.. థర్డ్‌ వేవ్‌ ఉన్న నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వదిలేయాలా.. లేదంటే భయం లేకుండా పండుగ చేసేసుకోవాలా.. అదీ కాదంటే జాగ్రత్తలు పాటిస్తూ చేసుకోవచ్చా.. ! ఈ మూడు రకాల ప్రశ్నల నడుమ ఏపీలో ఓ వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వానికి ఒక్కడి వైద్య ఆరోగ్యశాఖ ఓ రిపోర్ట్ ఇచ్చింది. కరోనా మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాలని. ప్రత్యేకించి పండుగల సీజన్‌పై ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం జగన్‌ కూడా సమీక్ష జరిపి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలపైనే ఏపీ బీజేపీ రుసరుసలాడుతోంది.

ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కంటిన్యూ అవుతుంది. సో.. ఈసారి వినాయక చవితి ఇళ్లపై పరిమితం చేద్దాం. పబ్లిక్ స్థలాల్లో వేడుకలు వద్దు. మంటలకు నో పర్మిషన్‌. నిమజ్జనాలుంటాయి గానీ, ఊరేగింపులకు పర్మిషన్ లేదు. వైద్య ఆరోగ్యశాఖ సూచనలు కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే ! ఈ ఆదేశాలపైనే ఏపీ బీజేపీ కొన్ని ప్రశ్నలు వేస్తోంది. ఎవరికీ, ఏ పండుగకూ లేని ఆంక్షలు పండుగలపై ఎందుకు? స్కూళ్లు కూడా తెరిచారు.. పిల్లల్ని పంపిస్తున్నారు. ఈ మధ్య వర్థంతి కార్యక్రమాలూ చేశారు. గుడ్‌ ఫ్రైడే, మొహరం కూడా నిర్వహించారు. ప్రజారోగ్యం మాకూ ముఖ్యమే. అందుకే కరోనా ఆంక్షలు పాటిస్తూనే పండుగ చేస్తాం పర్మిషన్ ఇవ్వమంటోంది ఏపీ బీజేపీ.

వేడుకలపై ఆంక్షలకు సంబంధించి ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌ సైతం విరుచుకుపడ్డారు. కాగా, వినాయకచవితికి ఆంక్షలెందుకు అన్న బీజేపీ ప్రశ్నలపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న సమాధానం కేంద్రాన్నే. కొవిడ్ నేపథ్యంలో సెంట్రల్‌ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే నిబంధనలు ఉన్నాయంటోంది ప్రభుత్వం. ఆగస్టు 28న కేంద్రం నుంచి కొన్ని ఉత్తర్వులు వచ్చాయి. అందులో పేరా నెంబర్ 4లో పండుగలకు సంబంధించిన మార్గదర్శకాలున్నాయి. దాని ప్రకారం చూస్తే ఒకటి, పండుగల వేళ జాగ్రత్తలు అవసరం. రెండు జనం గుమిగూడే కార్యక్రమాలు వద్దు. మూడు.. అవసరం అయితే లోకల్‌గా కూడా నిబంధనలు పెట్టుకోవచ్చు. నాలుగు, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించే వెసులుబాటు కూడా ఉంది. ఐదు.. ఇవన్నీ ఫాలో అవుతూ, టెస్ట్ -ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేషనల్‌ పాలసీని కంటిన్యూ చెయ్యాలి అని.!

Read also: Gold smuggling: విజయవాడ పోలీసుల అదుపులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా.. వాయు, జల మార్గాల ద్వారా రవాణా