AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎప్పుడూ, ఎలా తాగాలో తెలుసా..?

గ్రీన్ టీ మెటాబాలిజం పెంచడం, ఒత్తిడి తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక లాభాలను అందిస్తుంది. కానీ దీనిని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఈ గ్రీన్ టీ తీసుకునే విషయంలో మనం చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎప్పుడూ, ఎలా తాగాలో తెలుసా..?
Green Tea
Prashanthi V
|

Updated on: May 14, 2025 | 11:43 AM

Share

ఆహారం తినగానే గ్రీన్ టీ తాగడం ఉత్తమం కాదు. ఈ సమయానికి గ్రీన్ టీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహారంతో గ్రీన్ టీ మిళితమవడం వల్ల దాని పోషకాలు శరీరంలో సరిగ్గా గ్రహించబడవు. కనుక ఆహారం తిన్న తర్వాత కనీసం 60 నిమిషాలు గ్యాప్ తీసుకుని గ్రీన్ టీ తాగడం మంచిది.

గ్రీన్ టీను ఖాళీ కడుపుతో తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. జీర్ణవ్యవస్థను బలహీనపరిచే అవకాశం ఉంది. ఇది అస్వస్థతను కలిగించడంతో పాటు ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మానుకోవాలి.

గ్రీన్ టీలో ఉన్న కెఫిన్ అధికంగా తీసుకుంటే శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2-3 కప్పులు మాత్రమే గ్రీన్ టీ తాగడం మంచిది.

గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడే దానిలో తేనె కలపడం మంచిది కాదు. ఎందుకంటే వేడి టీలో తేనె కలిపితే దానిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. అంతేగాక అధిక వేడి తేనెను హానికరంగా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే గ్రీన్ టీ కొద్దిగా చల్లారిన తర్వాతే తేనె కలపడం ఉత్తమం.

గ్రీన్ టీతో మందులు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మందులతో గ్రీన్ టీ తాగడం వలన మందుల ప్రభావం మారవచ్చు. గ్రీన్ టీకి సంబంధించి యాంటీ ఆక్సిడెంట్లు మందులతో కలిసి హానికరమైన ప్రభావాలు చూపవచ్చు. కాబట్టి మందులతో గ్రీన్ టీ తాగడం మానుకోవాలి.

ఒకేసారి రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ఉపయోగించడం వల్ల కెఫిన్ పరిమాణం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచే ప్రమాదం కలుగజేస్తుంది. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఒక్క గ్రీన్ టీ బ్యాగ్‌ తోనే సరిగ్గా టీ తయారు చేసుకోవడం మంచిది.

గ్రీన్ టీను వేగంగా తాగడం మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. గ్రీన్ టీను నెమ్మదిగా తాగడం వల్ల దాని పోషకాలు మెరుగ్గా శరీరానికి అందుతాయి. గ్రీన్ టీని సరైన పద్ధతిలో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)