ఇవి తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.. గుండెకు మంచిదంటున్నారు నిపుణులు..!
ప్రస్తుత కాలంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఇది గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. ప్రాసెస్‌డ్ ఫుడ్ కు బదులుగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోజూ కొన్ని గింజలను మితంగా తింటే శరీరానికి శక్తి లభించడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇప్పటి జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతున్నాయి. పనిలో ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, వేళకు తినకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తున్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడం కోసం సరైన ఆహారం తీసుకోవడం అవసరం.
బాదంలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కొన్ని బాదం గింజలు నానబెట్టి తింటే.. శరీరానికి శక్తి అందడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. బాదం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది.
సహజమైన తీపి కలిగిన ఖర్జూరాల్లో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ 2 లేదా 3 ఖర్జూరాలు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
పిస్తా గింజల్లో పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సహకరిస్తాయి. ఉదయాన్నే 5 నుంచి 6 పిస్తా తినటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే వాల్ నట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మంచి కొవ్వులను పెంచుతూ.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణం కలిగి ఉంటాయి.
ఎండుద్రాక్షలో సహజ తీపిదనంతో పాటు విటమిన్ లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రిపూట నానబెట్టి ఉదయం తినటం చాలా మంచిది.
జీడిపప్పులో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి. అయితే ఎక్కువగా కాకుండా మితంగా రోజూ కొన్ని తీసుకోవాలి.
ప్రూన్స్ ఎండబెట్టిన పండ్లు. ఇవి ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. వీటిని స్నాక్ లా లేదా సలాడ్ లో కలిపి తినొచ్చు.
పెకాన్స్ అనే గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను కాపాడతాయి. శరీర బరువు నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అనేక సమస్యలకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రాసెస్‌డ్ ఫుడ్ కి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చాలి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి, గుండెను కాపాడతాయి. ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకుంటే మెరుగైన ఆరోగ్యాన్ని పొందొచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




