AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతోషంగా ఉండడానికి ఇవి తినాల్సిందే.. ఈ ఫుడ్స్ గురించి మీకు తెలుసా..?

రోజూ సంతోషంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు చాలా కీలకం. మనం తీసుకునే ఆహారం నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ట్రిప్టోఫాన్, ఒమేగా 3, విటమిన్ B6, ప్రొబయోటిక్స్ వంటి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

సంతోషంగా ఉండడానికి ఇవి తినాల్సిందే.. ఈ ఫుడ్స్ గురించి మీకు తెలుసా..?
Top Happiness Foods
Prashanthi V
|

Updated on: May 14, 2025 | 12:05 PM

Share

రోజూ సంతోషంగా ఉండాలంటే కేవలం ఆలోచనలే కాదు.. ఆహారం కూడా కీలకం. మనం తినే ఆహారం మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది. శరీరాన్ని పోషించడమే కాకుండా మనసుకూ ఆరోగ్యం అందించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాట్లు మెదడులో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ఇవి చురుకుదనం పెంచడంలో తోడ్పడతాయి. ప్రతివారం రెండు లేదా మూడు సార్లు తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

గుమ్మడి గింజల్లో సహజంగా ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం మెదడులో హ్యాపీ హార్మోన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. రోజూ ఒక చిన్న మోతాదులో తీసుకుంటే ఉల్లాస భావన మెరుగవుతుంది.

విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం ఒక గుడ్డు తినడం శరీరానికి శక్తిని అందిస్తే.. మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది. గుడ్లలో ఉండే పోషకాల వల్ల ఉల్లాస భావన మెరుగవుతుంది.

యోగర్ట్, కెఫిర్, కిమ్చీ వంటివి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలో సంతోష హార్మోన్ స్థాయిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ బాగుంటే మనసూ తేలికగా ఉంటుంది.

అరటి పండులో ఉండే విటమిన్ B6 మెదడులో సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుంది. ఇది తిన్న వెంటనే ఆనందానుభూతి కలుగుతుంది. అలసట, మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి.

వాల్‌నట్స్‌ లో శరీరానికి ఉపయోగకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును సమతుల్యం చేసి మానసిక ఆందోళన తగ్గించడంలో తోడ్పడతాయి. రోజు 30 గ్రాములు తీసుకుంటే చాలు.

కాఫీలో ఉండే కెఫైన్ మెదడులో డోపమైన్ స్థాయిని పెంచి మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. ఒక్క కప్పు కాఫీ తాగితే మనసు చురుకుగా మారడమే కాకుండా.. ఊహాశక్తి కూడా తక్కువకాలంలో మెరుగవుతుంది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ తగ్గించడంతో పాటు మెదడుకు సానుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. బెర్రీలు తినడం ద్వారా ఆందోళన తగ్గుతుంది.

ఓట్స్ లో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా సెరటోనిన్‌ను విడుదల చేస్తాయి. ఉదయం ఓట్స్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండి.. రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది శాంతియుత మూడ్‌ను ఏర్పరుస్తుంది. ప్రతి రోజు ఆహారంలో వీటిని చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన శక్తితో పాటు మెదడుకు కావాల్సిన మానసిక శాంతి అందుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఆనందంగా జీవించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)